Thalapathy 67 | లోకేశ్ కనగరాజ్ టీం దళపతి 67 సర్ప్రైజ్.. వీడియో
దళపతి 67 (Thalapathy 67) బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు లోకేశ్ కనగరాజ్. ఫీ మేల్ లీడ్ రోల్లో త్రిష నటిస్తోందని ఇప్పటికే అప్డేట్ ఇచ్చిన లోకేశ్ టీం ఇప్పుడు సర్ప్రైజ్ వీడియోను షేర్ చేసింది.
ఫిబ్రవరి మొదటివారంలో అందరికీ సర్ప్రైజ్ ఉంటుందని మైఖేల్ ప్రమోషనల్ ఈవెంట్లో ముందుగానే చెప్పేశాడు స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. అయితే అంతకుముందే బ్యాక్ టు బ్యాక్ దళపతి 67 (Thalapathy 67) అప్డేట్స్ ఇస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. ఫీ మేల్ లీడ్ రోల్లో త్రిష నటిస్తోందని ఇప్పటికే అప్డేట్ ఇచ్చిన లోకేశ్ టీం ఇప్పుడు సర్ప్రైజ్ వీడియోను షేర్ చేసింది. ఇంతకీ ఆ వీడియో ఏంటనే కదా మీ డౌటు. దళపతి 67 పూజా కార్యక్రమం వీడియోను షేర్ చేశారు మేకర్స్.
హీరో విజయ్, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, యాక్షన్ కింగ్ అర్జున్‌తోపాటు త్రిష, ప్రియా ఆనంద్ ఇతర నటీనటులు, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, అర్జున్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. మనోజ్ పరమ హంస కెమెరామెన్.
ఈ చిత్రానికి డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ డైలాగ్స్ అందిస్తున్నారు. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. మాస్టర్ మూవీ తర్వాత లోకేశ్ కనగరాజ్-విజయ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దళపతి 67పై భారీగా అంచనాలు ఉన్నాయి.
దళపతి 67 సర్ప్రైజ్..
EXCLUSIVE 😉
Ek, Dho, Theen 💥#Thalapathy67 poojai video is here 🔥▶️ https://t.co/2hmpeI9A7x#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @trishtrashers @anirudhofficial @Jagadishbliss @manojdft @anbariv @philoedit @ArtSathees #DineshMaster @MrRathna @DeerajVaidy pic.twitter.com/mqgIZ3WjNc
— Seven Screen Studio (@7screenstudio) February 1, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

