Lokesh Kanagaraj | గ్యాంగ్‌స్టర్‌గా లోకేష్ కనగరాజ్ ఎంట్రీ.. ‘డీసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
Lokesh Kanagaraj | దర్శకుడిగా వరుస బ్లాక్బస్టర్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'డీసీ (DC)' విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం జులై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Lokesh Kanagaraj | దర్శకుడిగా వరుస బ్లాక్బస్టర్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘డీసీ (DC)’ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం జులై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంటోంది.
పోస్టర్లో ప్రధాన పాత్రల లుక్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో రా అండ్ రస్టిక్ గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని, హై వోల్టేజ్ యాక్షన్‌ను దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తనదైన శైలిలో ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘డీసీ’ అనే టైటిల్ వెనుక కూడా ఆసక్తికరమైన అంశం ఉంది. కథలోని రెండు ప్రధాన పాత్రలైన దేవదాస్ మరియు చంద్ర పేర్లలోని తొలి అక్షరాలతో ఈ టైటిల్‌ను రూపొందించారు. ఈ ఇద్దరి మధ్య జరిగే గ్యాంగ్‌స్టర్ పోరాటమే సినిమా ప్రధాన కథాంశంగా ఉండనుంది. ‘కెప్టెన్ మిల్లర్’, ‘రాకీ’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రాన్ని తన ప్రత్యేక డార్క్ విజువల్ స్టైల్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అరుణ్ రంజన్ అందించిన స్క్రీన్‌ప్లే సినిమాకు మరో ప్రధాన బలంగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి వామికా గబ్బి కథానాయికగా నటిస్తోంది. ఓటీటీతో పాటు దక్షిణాది చిత్రాల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్న ఆమెకు ‘డీసీ’ కీలక చిత్రం కానుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ రగ్గడ్ లుక్, వామికా గబ్బి నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సినిమాకు సంగీతాన్ని రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. గతంలో లోకేష్ దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమ్’, ‘లియో’ చిత్రాలకు అనిరుధ్ అందించిన సంగీతం విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు హీరోగా లోకేష్ నటిస్తున్న తొలి చిత్రానికి కూడా ఆయన అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందనే అంచనాలు ఉన్నాయి. భారీ నిర్మాణ విలువలతో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుండగా, లోకేష్ కనగరాజ్ హీరోగా ఎలాంటి విజయాన్ని అందుకుంటారనే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

