Liger mass dance | మాస్ బీట్తో రెడీ అవుతున్న ‘లైగర్’
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చేస్తున్న తాజా చిత్రం లైగర్ (Liger). విజయ్ దేవరకొండపై వచ్చే ఈ మాస్ బీట్‌ను ప్రస్తుతం ముంబైలో చిత్రీకరిస్తున్నారు.

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చేస్తున్న తాజా చిత్రం లైగర్ (Liger). పూరీ జగన్నాథ్ దర్శకత్వం (Puri Jagannadh) వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. లైగర్ కోసం ఇపుడు మాస్ సాంగ్ రెడీ అవుతోంది.విజయ్ దేవరకొండపై వచ్చే ఈ మాస్ బీట్‌ను ప్రస్తుతం ముంబైలో చిత్రీకరిస్తున్నారు. విజయ్ దేవరకొండ స్టైలిష్ రింగ్స్ తో పాట కోసం వేసుకున్న కాస్ట్యూమ్‌లో ఉన్న స్టిల్‌ను ఛార్మి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని అందరితో పంచుకుంది. విజయ్ తన డ్యాన్స్‌తో ఇరగదీయడం ఖాయమని పేర్కొంది ఛార్మి.
బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ (Mike Tyson) కీలక పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. లైగర్‌లో బాలీవుడ్ నటి అనన్యపాండే హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ కీ రోల్ చేస్తోంది. పాట షూటింగ్ పూర్తవగానే యూఎస్ షెడ్యూల్ త్వరలో మొదలు కానుంది.

ఇప్పటికే విడుదలైన లైగర్ లుక్స్ సినిమాకు చాలా హైప్ తీసుకొస్తున్నాయి. పాన్ ఇండియా స్టోరీ కావడం, మైక్ టైసన్ సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతుండటంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా..? అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Rajinikanth: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్న రజనీకాంత్.. ప్రౌడ్ మూమెంట్ అంటూ ట్వీట్స్
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

