Liger Non-theatrical rights | ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలను సైతం తన నటనకు జోహార్లు కొట్టేలా చేసాడు విజయ్ దేవరకొండ. సినీరంగంలో హీరోగా ఎంట్రీ అనేది చాలా కష్టం. ఇక హీరోగా అవకాశం వచ్చినా అది నిలబెట్టుకోవాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఆ శ్రమనే ఆయుధంగా వాడుకొని విజయ్ టాలీవుడ్ టైర్-2 హీరోలలో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన’లైగర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్థుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు25న విడుదల కానుంది. ఈ క్రమంలో లైగర్ నాన్-థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం.
‘లైగర్’ చిత్రానికి దాదాపు రూ.99 కోట్ల నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఇటు విజయ్ కెరీర్లోనూ, అటు పూరీ కెరీర్లోనూ ఇంత మేర బిజినెస్ జరగడమేనిది విశేషం అనే చెప్పాలి. కేవలం ఈ చిత్రం మ్యూజిక్ రైట్స్ సోనీ సంస్థ రూ.14కోట్లకు కొనుగోలు చేసింది. డిజిటల్, శాటిలైట్ హక్కుల కలిపి రూ.85కోట్లకు స్టార్ సంస్థ దక్కించుకుంది. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో లైగర్ చిత్రానికి రూ.70 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ముంభైలోని ఓ ఛాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సార్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరీ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో అన్ని ముఖ్యమైన భాషల్లో విడుదల కానుంది.