Liger | ‘లైగర్’ నుంచి బిగ్ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేనట?
Liger Movie songs | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి రెండేళ్ళు దాటింది. ఈయన నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఇటీవలే ‘లైగర్’ నాన్ థియేట్రికల్ హక్కులు రూ.99కోట్లకు అమ్ముడయ్యాయి. టైర్-2 హీరోకు ఈ రేంజ్లో బిజినెస్ జరగడం విశేషం అనే చెప్పాలి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ క్రమంలో లైగర్ టీం అప్డేట్లను స్టార్ట్ చేసింది. తాజాగా మేకర్స్ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
‘ఇండియా, మేము ఓపికగా వేయిట్ చేశాము. ఇప్పుడు మా వేట స్టార్ట్ చేశాము’ అంటూ లైగర్ ఫస్ట్ సింగిల్ విడుదల తేదీను వెల్లడించారు. ‘ది లైగర్ హంట్’ థీమ్‌ను మే 9 సాయంత్రం 4.00 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మణిశర్మ నేపథ్య సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తనిష్క్ బగ్చీ పాటలు సమకూరుస్తున్నాడు. ముంభైలోని ఓ ఛాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సార్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరీ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగు తోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
On
May 9th.
4 PM.#LIGERHunt pic.twitter.com/i7FOc82bol— Vijay Deverakonda (@TheDeverakonda) May 7, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

