Surya teja aelay | ఇండస్ట్రీలోనే సెటిలవుతా
Surya teja aelay | ‘భరతనాట్యం’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు సూర్యతేజ ఏలే. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో పాయల్ సరాఫ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సూర్యతేజ ఏలే బుధవారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..
Surya teja aelay | ‘భరతనాట్యం’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు సూర్యతేజ ఏలే. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో పాయల్ సరాఫ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సూర్యతేజ ఏలే బుధవారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..
- నా నేపథ్యం గురించి చెప్పాలంటే..మా నాన్న ధని ఏలే సినీరంగంలో పాతికేళ్లుగా ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. నేను పెయింటింగ్‌లో ఫైన్ ఆర్ట్స్, మాస్టర్స్ చేశాను. సినిమా టైటిల్స్ డిజైనింగ్‌తో పాటు ఎడిటింగ్‌లో కూడా అనుభవముంది. గత కొన్నేళ్లుగా సినీ రచనపై దృష్టి పెట్టాను. ‘భరతనాట్యం’ కథ నేను రాసిందే.
- హీరో అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. స్కూల్ రోజుల నుంచే దర్శకత్వం మీద ఆసక్తి ఉండేది. ఆ తర్వాత రైటింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కథలు రాయడం, వాటిని ఎవరికైనా నరేట్ చేయడం చేస్తుండేవాడిని. ఆ సమయంలో దర్శకుడు కెవీఆర్ మహేంద్రకు ఈ కథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చడంతో డైరెక్షన్ చేయమని కోరాను. ఈ కథకు హీరోగా నేనైతే బాగుంటుందని దర్శకుడు, నిర్మాతలు భావించారు. అలా హీరోగా నా ప్రయాణం మొదలైంది.
- ఇదొక ఫిక్షనల్ స్టోరీ. కానీ నిజ జీవితంతో రిలేట్ చేసుకునేలా ఉంటుంది. క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్. ఒక వ్యక్తి ఎదగడానికి షార్ట్‌కట్స్‌ను నమ్మితే ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథాంశం. నా వ్యక్తిగత జీవితంలో చూసిన కొన్ని సంఘటనలను వినోదాత్మక కోణంలో ఆలోచించి ఈ కథ రాశాను. సినిమా ఆద్యంతం నవ్విస్తుంది. కథానుగుణంగా ‘భరతనాట్యం’ అనే టైటిల్ పక్కాగా కుదిరింది. ఆ టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది.
- ఈ సినిమాను గొప్ప ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కించారు. కాసర్ల శ్యామ్, అనంత శ్రీరామ్, భాస్కరభట్ల అద్భుతమైన పాటలు రాశారు. వివేక్‌సాగర్ నేటి ట్రెండ్‌కు తగ్గట్లు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమా విషయంలో మా నాన్న చాలా సంతృప్తిగా ఉన్నారు. ఆయన కళ్లలో ఆనందం కనిపిస్తున్నది. భవిష్యత్తులో ఇండస్ట్రీలోనే కొనసాగాలనుకుంటున్నా. అది నటుడిగానైనా, రచయితగానైనా ఫర్లేదు .రచయితగా కొన్ని కథలను సిద్ధం చేశా. నా తదుపరి సినిమా విశేషాలను త్వరలో తెలియజేస్తా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

