Lawrence Daughter | రాజకీయాల్లోకి లారెన్స్.. ఆయన కుమార్తె సినీ రంగప్రవేశం..!
Lawrence Daughter | దక్షిణాది సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెండితెరపై ఆయన చేసే అద్భుతమైన నృత్యాలు, హారర్ చిత్రాలు ఎంతగానో ప్రేక్షకులను అలరిస్తుంటే, మరోవైపు ఆయన చేసే సామాజిక సేవా కార్యక్రమాలు కోట్లాది మంది అభిమానుల ప్రశంసలను అందుకుంటుంటాయి.
Lawrence Daughter | దక్షిణాది సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెండితెరపై ఆయన చేసే అద్భుతమైన నృత్యాలు, హారర్ చిత్రాలు ఎంతగానో ప్రేక్షకులను అలరిస్తుంటే, మరోవైపు ఆయన చేసే సామాజిక సేవా కార్యక్రమాలు కోట్లాది మంది అభిమానుల ప్రశంసలను అందుకుంటుంటాయి. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడటం, అవసరమైన వారికి సహాయం చేయడం లారెన్స్ వ్యక్తిత్వానికి నిదర్శనం. ప్రస్తుతం లారెన్స్ ‘కాంచన 4’, ‘బెంజ్’ వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన పేరు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం ఆయన సినిమాలు కాదు. ఒకవైపు ఆయన కుమార్తె సినీ రంగ ప్రవేశంపై వార్తలు వస్తుండగా, మరోవైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
రాఘవ లారెన్స్‌కు రాఘవి అనే కుమార్తె ఉన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే తాజాగా ఆమె సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్గా కాకుండా దర్శకురాలిగా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నారని ప్రచారం జరుగుతోంది. కొత్త తరహా కథతో ఆమె చిత్రసీమకు పరిచయం కానున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై లారెన్స్ సన్నిహిత వర్గాలు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాఘవికి సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదని, ఆమె పూర్తిగా తన ఉన్నత విద్యపైనే దృష్టి సారించిందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని కూడా పేర్కొంటున్నారు. అయినప్పటికీ ఈ వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో కూడా లారెన్స్ పేరు బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి విజయ్ తాను గెలిచిన రెండు స్థానాల్లో ఒకటైన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడ ఉపఎన్నిక జరిగే అవకాశాలపై చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ స్థానానికి బలమైన అభ్యర్థిని ఎంపిక చేయాలనే ఆలోచనలో టీవీకే పార్టీ ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రజల్లో మంచి గుర్తింపు, సేవా కార్యక్రమాల ద్వారా విశేష ఆదరణ సంపాదించుకున్న రాఘవ లారెన్స్ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సామాజిక సేవతో పాటు యువతలో ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఆయనను బరిలోకి దించాలని పార్టీ భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే రాఘవి సినీ రంగ ప్రవేశం కావచ్చు, లారెన్స్ రాజకీయ ప్రవేశం కావచ్చు.. ఈ రెండు అంశాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

