Lavanya Tripati | అనుకున్న తేదీ కంటే వారం రోజులు ముందుగానే ‘హ్యపీ బర్త్‌డే’ విడుదల!
Happy Birthday Movie Gets Pre-poned | టాలీవుడ్లో గత రెండు మూడేళ్ళ నుండి కంటెంట్ సినిమాలకు విశేష స్పందన వస్తుంది. దర్శకుడు ఎవరు? హీరో ఎవరు? అనే దాన్ని పక్కన పెట్టి కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రాలు ఊహించని స్థాయిలో విజయాలు సాధిస్తున్నాయి. శ్రీ సింహా హీరోగా నటించిన ‘మత్తువదలరా’ చిత్రం కూడా ఈ కోవలోకి చెందిందే. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహించాడు. రితేష్ కథ, స్క్రీన్‌ప్లే రాసుకున్న విధానం ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. 2019లో విడుదలైన బెస్ట్ చిత్రాలలో మత్తువదలరా ఒకటిగా నిలిచింది. మళ్ళీ ఇప్పటివరకు ఈ దర్శకుడి నుండి సినిమా రాలేదు. ఈ క్రమంలో రితేష రెండేళ్ళు గ్యాప్ తీసుకుని ‘హ్యపి బర్త్‌డే’ సినిమా తెరకెక్కించాడు.
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో వివేక్ అగస్థ్య కీలకపాత్రలో నటించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రంలోని ముఖ్య పాత్రల్లో నటించిన ఆర్టిస్టుల క్యారెక్టర్ ప్రోమోస్‌ను మేకర్స్ రివీల్ చేస్తూ ప్రేక్షకులలో అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని జూలై 15నవిడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. అయితే తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని వారం రోజులు ముందుగా జూలై 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా శుక్రవారం నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమాను జూలై 8 నుండి 22కి పోస్ట్ పోన్ చేశారు. ఇక జూలై 8న పెద్ద సినిమాలేవి విడుదల కావడంలేదు. దాంతో ఈ చిత్రాన్ని ప్రీ పోన్ చేశారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైనమెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
𝐏𝐚𝐫𝐭𝐲 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐦𝐞𝐧𝐭 📢
The #HappyBirthday party begins early on July 8th 🎉
Come and have a blast 🥳
Thank you 🙏🏻 #HBDMovieOnJuly8 @Itslavanya @RiteshRana @vennelakishore @nareshagastya #Satya @kaalabhairava7 @sureshsarangam @ClapEntrtmnt @MythriOfficial pic.twitter.com/hEgJfePdge— BA Raju's Team (@baraju_SuperHit) June 25, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

