Lavanya Tripathi | పెళ్లి తర్వాత ఫస్ట్ వెబ్ సిరీస్‌తో వస్తున్న మెగా కోడలు.. టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్!
Lavanya Tripathi | వరుణ్‌తేజ్‌తో పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌కు రీఎంట్రీ ఇస్తోంది మెగా కోడలు లావణ్య త్రిపాఠి. నవంబరులో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ (Varun Tej)ను పెళ్లి చేసుకున్న ఈ భామ చాలా రోజుల గ్యాప్ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది.
Lavanya Tripathi | వరుణ్‌తేజ్‌తో పెళ్లి తర్వాత వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తోంది మెగా కోడలు లావణ్య త్రిపాఠి. నవంబరులో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ (Varun Tej)ను పెళ్లి చేసుకున్న ఈ భామ చాలా రోజుల గ్యాప్ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. లావణ్య త్రిపాఠి, బిగ్‌బాస్ ఫేమ్ అభిజీత్, అభిజ్ఞ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్ (Miss Perfect). ఈ సిరీస్‌కు విశ్వక్ కే ఖండేరావ్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదల కానుంది. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో లావణ్య త్రిపాఠి సూట్ కేస్ మీద కూర్చొని తీక్షణంగా చూస్తుండగా.. అభిజీత్ లాప్ ట్యాప్ చేతిలో పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోంది. ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు ప్రకటించారు.
Starting this new year on a perfect note!
Miss Perfect sir, Miss Perfect anthe 👌#MissPerfectonHotstar Coming Soon only on #DisneyPlusHotstar@Abijeet @abhignya_v #VishvakKhanderao @AnnapurnaStdios #SupriyaYarlagadda @adityajavvadi @prashanthvihari @disneyplushstel pic.twitter.com/An6XjCbWuk
— LAVANYA (@Itslavanya) January 3, 2024
వరుణ్‌తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టస్కానీ నగరంలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేడుకలో మెగా, త్రిపాఠి, అల్లు కుటుంబంతోపాటు అతికొద్దిమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరై సందడి చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున 100వ సినిమాలో టబు స్పెషల్ రోల్.. గ్లింప్స్ ఎప్పుడు విడుదల కానుంది అంటే..!
Hair Thinning | జుట్టు రాలకపోయినా పలుచబడుతోందా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
నిరుద్యోగులకు ‘ప్రెసిడెన్షియల్’ షాక్.. 4 జిల్లాల్లో పోలీసు ఉద్యోగార్థుల కడుపుకొట్టిన కాంగ్రెస్!
Sai Pallavi | ఇకపై ఆచితూచి మాట్లాడతా.. వివాదాలపై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు
Raaka | అల్లు అర్జున్ ‘రాకా’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. దుబాయ్ షెడ్యూల్ హైదరాబాద్‌కు మార్పు!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

