‘లక్ష్యం’ సినిమాకు 14 ఏళ్ళు .. భారీ లాభాలు రాబట్టిన బ్లాక్ బస్టర్ మూవీ

గోపీచంద్ కెరీర్ హీరోగా అప్పుడప్పుడే నిలబుడుతున్న సమయం. ఈయనపై కూడా మంచి బడ్జెట్ పెట్టొచ్చు అని నిర్మాతలు ఆలోచిస్తున్న తరుణం. స్టార్ డైరెక్టర్స్ ఇంకా ఆయన వైపు అడుగుల వేయకపోయినా కూడా చిన్న దర్శకులతోనే మంచి విజయాలు అందుకుంటున్న రోజులవి. అలాంటి సమయంలో శ్రీవాస్ అనే ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి సినిమాకు కమిటయ్యాడు గోపీచంద్. పైగా అందులో సీనియర్ హీరో జగపతిబాబు కూడా ఉన్నాడు. ఈ ఇద్దరూ అన్నాదమ్ములుగా నటించిన సినిమా లక్ష్యం. 2007, జులై 5న విడుదలైన ఈ చిత్రం విడుదలై 14 ఏళ్లు పూర్తయింది. అనుష్క శెట్టితో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు గోపీచంద్. పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన లక్ష్యం సంచలన విజయం సాధించింది. మరి అప్పట్లో ఈ చిత్రం వసూలు చేసిన మొత్తం ఎంతో చూద్దాం..
నైజాం: 4.95 కోట్లు
సీడెడ్: 1.47 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.54 కోట్లు
ఈస్ట్: 0.85 కోట్లు
వెస్ట్: 0.73 కోట్లు
గుంటూరు: 0.88 కోట్లు
కృష్ణా: 0.94 కోట్లు
నెల్లూరు: 0.47 కోట్లు
ఏపీ + తెలంగాణ మొత్తం: 11.83 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 1.92 కోట్లు
వరల్డ్ వైడ్: 13.75 కోట్లు
లక్ష్యం సినిమా అప్పట్లో 5.4 కోట్ల బిజినెస్ చేసింది. అప్పటికే రణం, యజ్ఞం లాంటి సినిమాలు మంచి విజయాలు సాధించడంతో గోపీచంద్ సినిమాకు మంచి మార్కెట్ వచ్చింది. అలాంటి సమయంలో వచ్చిన లక్ష్యం ఏకంగా 14 కోట్ల షేర్ వసూలు చేసింది. నిర్మాతలతో పాటు బయ్యర్లకు కూడా లాభాల పంట పండించింది. దాదాపు 9 కోట్ల లాభాలు తీసుకొచ్చింది లక్ష్యం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Anushka
- gopi chand
- lakshyam
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

