రాఖి, రిత్విక్, అభినవ్, నందు, ఆంటోనీ కార్తిక్ ముఖ్య పాత్రధారులుగా రూపొందిన యువతరం కామెడీ ఎంటర్టైనర్ ‘లఫూట్ గ్యాంగ్’. అనురాగ్ అధర్వరాజు దర్శకత్వంలో కొండాపూర్ లక్ష్మీకాంత్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు అలీ క్లాప్ కొట్టగా, దర్శకుడు పవన్ సాధినేని కెమెరా స్విచాన్ చేశారు.
నటులు రాజ్ తరుణ్, ఆకాశ్‌పూరి స్క్రిప్ట్‌ని దర్శకుడికి అందజేశారు. ఇంకా నిర్మాత బీవీఎస్ రవి, రాహల్ విజయ్, నటి దీప్సిక, అర్చన అయ్యర్, అనిల్ కడియాల ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. 1990 నాటి కాలంలో జరిగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇదని, ఈ పీరియడ్ కథ కొత్తగా ఉంటుందని దర్శకుడు అనురాగ్ అధర్వరాజ్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వర్ధన్ మయూర్ కొయ్యడ, సంగీతం: ధృవన్, నిర్మాణం: ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్.