Kushi Movie | ఖుషీ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్..!
Kushi Movie Songs | ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ ‘ఖుషీ’ సినిమాపైనే ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.
Kushi Movie Songs | ‘లైగర్’ ఫలితం విజయ్ దేవరకొండను తీవ్రంగా నిరాశపరిచింది. దాదాపు రెండేళ్ల పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. యునానిమస్‌గా ఈ సినిమా తిరస్కారానికి గురి కావడంతో విజయ్ సైతం సైలెంట్ అయిపోయాడు. ఇక ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ ‘ఖుషీ’ సినిమాపైనే ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై కాస్త మంచి అటెన్షన్‌నే క్రియేట్ చేశాయి. రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ఇప్పటి నుంచే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై అంచనాలు నెలకొల్పుతున్నారు.
తాజాగా ఖుషీ సెకండ్ సింగిల్ ప్రోమోను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఆరాధ్య అంటూ సిద్ శ్రీ రామ్ గాత్రం వింటుంటే ఊహల్లో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. సిద్ శ్రీ రామ్ ఆలిపించిన ఈ పాటకు శివ నిర్వాణ సాహిత్యం అందించాడు. ఈ పాట ఫుల్ సాంగ్ జూన్ 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన నా రోజా నువ్వే సాంగ్ ఇన్‌స్టాంట్‌గా ఎక్కేసింది. రీల్స్, షార్ట్స్లతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ సింగిల్ కూడా అదే రేంజ్లో ఉంటుందని చిత్రయూనిట్ వెల్లడించింది.
కాశ్మీర్ బ్యాక్గ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. విజయ్‌కు జోడీగా సమంత నటిస్తుంది. నిజానికి ఈ సినిమా రెండు నెలల ముందే విడుదల కావాల్సి ఉంది. కానీ సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడటంతో షూటింగ్ ఆలస్యమైంది. దాంతో ఈ సినిమా రిలీజ్‌ను సెప్టెంబర్‌కు పోస్ట్ పోన్ చేశారు. అంతేకాకుండా ముందుగా ఈ సినిమా కేవలం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

