Samantha | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ యాక్టర్లలో ఒకరు సమంత (Samantha). ఈ చెన్నై చిన్నది చాలా కాలం తర్వాత రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖుషి (Kushi) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సెప్టెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే యూఎస్ బాక్సాఫీస్ శద్ద 1.4 మిలియన్ డాలర్లు వసూళ్లు చేసింది. సమంత కెరీర్లో యూస్‌లో మిలియన్ డాలర్లు రాబట్టిన 17వ సినిమాగా ఖుషి రికార్డుల్లోకెక్కింది. సినిమా విడుదల సమయంలో సమంత యూఎస్‌లో ఉంది. అక్కడే సినిమాను ప్రమోట్ చేసింది.
తాజా అప్డేట్ ప్రకారం సమంత హైదరాబాద్‌లో ల్యాండ్ అయింది. ఇవాళ ఉదయం నగరానికి చేరుకున్న సమంత రేపటి నుంచి పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నబోతున్నదని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. సమంత, విజయ్ దేవరకొండ పలు పట్టణాల్లో తిరుగనున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్‌ను నిర్వహించే పనిలో ఉన్నారని ఇన్సైడ్ టాక్.
తాజా అప్డేట్ ప్రకారం ఖుషి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 70.23కోట్లు వసూళ్లు రాబట్టింది. విప్లవ్ -ఆరాధ్య ఇప్పుడు అన్ని కుటుంబాలకు ఇంటి పేర్లుగా మారిపోయాయి.. అంటూ మేకర్స్ అప్డేట్ కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం తమిళం, ఇంగ్లీష్ బైలింగ్యువల్ ప్రాజెక్ట్ Chennai Storyలో నటిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఖుషి ఇచ్చిన సక్సెస్‌తో మళ్లీ ఫాంలోకి వచ్చాడు విజయ్ దేవరకొండ.
ఖుషి కలెక్షన్ల వివరాలిలా..
#Kushi Raked Over $1.4Million & hitting strong in USA 💥💥
Witness the most relatable tale of the most adorable pair on screens, Book your tickets now 🎟️
🇺🇸 Release by @ShlokaEnts #KushiForFamilies @TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic… pic.twitter.com/UovuBbupL7
— Mythri Movie Makers (@MythriOfficial) September 4, 2023
#Kushi scoring big at the BoxOffice, 70.23 cr+ gross worldwide in 3 days 💫✨
Viplav & Aradhya are now household names for all the families 🤩
Book your tickets now!
– https://t.co/16jRp6UqHu#BlockbusterKushi 🩷@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic… pic.twitter.com/VKhrbAEGXQ— Mythri Movie Makers (@MythriOfficial) September 4, 2023
ఖుషి టైటిల్ సాంగ్..
నా రోజా నువ్వే..
ఆరాధ్య సాంగ్..