ఖుష్బూను ఆ టాలీవుడ్ హీరో కమిట్మెంట్ అడిగాడంట..!
ఓ హీరో తనను కమిట్మెంట్ అడిగితే.. తన కూతురును తమ్ముడి గదికి పంపిస్తే తాను ఒప్పుకుంటానంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చినట్లు చెప్పింది ఖుష్బూ. దాంతో ఆ హీరో నోరు మూసుకున్నాడని తెలిపింది

ఖుష్బూకు కేవలం తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఈమె ఇండస్ట్రీకి పరిచయం అయిందే తెలుగు సినిమాతో. 1986లో వెంకటేష్ హీరోగా వచ్చిన కలియుగ పాండవులు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది ఖుష్బూ. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ చాలా సినిమాలు చేసింది. అక్కడ అభిమానులు ఏకంగా ఆమెకు గుడి కట్టారు. ఇలాంటి హీరోయిన్‌కు ఓ టాలీవుడ్ హీరో నుంచి వేధింపులు ఎదురయ్యాయంట. తనను ఓ అగ్ర హీరో కమిట్మెంట్ అడిగాడని.. తాను కూడా మీటూ బాధితురాలినే అని గతంలో చెప్పుకొచ్చింది.
తన తొలి సినిమా కలియుగ పాండవులు టైంలోనే వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పి అప్పట్లో సంచలనం సృష్టించింది ఖుష్బూ.
అప్పట్లో ఓ పల్లెటూరిలో సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు ఈ ఇష్యూ జరిగిందని గుర్తు చేసుకుంది. ఓ రోజు సాయంత్రం షూటింగ్ పూర్తయి తాను మేడ మీదకు వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన వెనక టచ్ చేశాడని.. దాంతో వెంటనే ఎవరని చూసుకోకుండా చెంప వాయించానని చెప్పింది ఈ భామ. మెట్లెక్కుతున్నప్పుడు వెనుక నుంచి అసభ్యంగా తాకేసరికి.. తనకు కోపం ఆగలేదని చెప్పింది. తాను కొట్టిన సమయంలో నిర్మాత సురేశ్ బాబు.. ఇతరులు కూడా అక్కడే ఉన్నారని.. అంతా తనకే అండగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకుంది ఖుష్బూ. ఇదే తనకు ఎదురైన తొలి మీటూ అనుభవం అంటుంది ఈ సీనియర్ హీరోయిన్.
ఆ తర్వాత కూడా ఇలాంటి వేధింపులు కొన్ని ఎదురయ్యాయని చెప్పింది. అంతేకాదు ఓ హీరో తనను కమిట్మెంట్ అడిగితే.. తన కూతురును తమ్ముడి గదికి పంపిస్తే తాను ఒప్పుకుంటానంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చినట్లు చెప్పింది ఖుష్బూ. దాంతో ఆ హీరో నోరు మూసుకున్నాడని తెలిపింది. ఇక తనకు ఆ సమయంలో వచ్చిన లవ్ లెటర్స్ గురించి కూడా నోరు విప్పింది ఖుష్బూ. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ తనకు కొందరు లవ్ ప్రపోజ్ చేస్తుంటారని చెబుతుంది ఖుష్బూ. అయితే అది తన భర్త సుందర్ కూడా తన మొదటి సినిమా దర్శకత్వం సమయంలోనే ప్రేమ గురించి చెప్పాడని.. అతడిలో ఉన్న నిజాయితీ నచ్చి వెంటనే ఓకే చేశానని చెప్పింది ఈ భామ. మొత్తానికి కమిట్మెంట్ గురించి చెప్పినా.. అడిగింది ఎవరనేది మాత్రం చెప్పలేదు ఈ సీనియర్ హీరోయిన్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్ అమ్మాయితో ఆమీర్‌ఖాన్ ఎఫైర్.. విడాకులు అందుకేనా?
రీమేక్‌లపై కన్నేసిన బాలీవుడ్.. పరాయి కథలతోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు
బిగ్ బాస్ 5 తెలుగులో ఆలీ ఎంట్రీ.. నిజమెంత?
విడుదలైన రెండేళ్ల తర్వాత ఖైదీ సినిమాపై కాపీ మరక
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
టేకులపల్లిలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి.. గర్భిణి భార్య, కుమార్తెకు తీరని శోకం
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
Rekha Naik | రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.. రూ.40.96 కోట్ల ధాన్యం కుంభకోణం కేసులో తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

