Krithi Shetty | నాన్న చేసిన ఆలస్యమే నన్ను హీరోయిన్ చేసింది.. లేదంటే..
Krithi Shetty | సినిమా రంగంలో అందరికీ సమాన అవకాశాలు రావు. కొంతమందికి ఎంతో కష్టపడి అవకాశాలు రావాల్సి వస్తే, మరికొందరికి ఆడిషన్‌కు వెళ్లిన క్షణంలోనే అదృష్టం తలుపు తడుతుంది. ఆ ‘అదృష్టవంతుల’ జాబితాలో కృతి శెట్టి కూడా ఒకరు.
Krithi Shetty | సినిమా రంగంలో అందరికీ సమాన అవకాశాలు రావు. కొంతమందికి ఎంతో కష్టపడి అవకాశాలు రావాల్సి వస్తే, మరికొందరికి ఆడిషన్‌కు వెళ్లిన క్షణంలోనే అదృష్టం తలుపు తడుతుంది. ఆ ‘అదృష్టవంతుల’ జాబితాలో కృతి శెట్టి కూడా ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఒక కమర్షియల్ యాడ్ ఆడిషన్ కోసం స్టూడియోకు వెళ్లిన ఆమె, ఆడిషన్ పూర్తయ్యాక తనను తీసుకెళ్లడానికి నాన్న వస్తానన్నారని చెప్పింది. కానీ ఆయనకి కొంచెం ఆలస్యం అయింది. ఆ గ్యాప్‌లో పక్కనే ఉన్న మరో స్టూడియోలోకి వెళ్లిపోయింది.
అక్కడ అప్పుడు ఒక సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆమెను చూసిన యూనిట్ సభ్యులు.. “సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉందా?” అని అడిగారు. ఏం అని చెప్పాలో తెలియక కృతి తన అమ్మ నంబర్‌ను ఇచ్చి బయటకు వచ్చేసింది. కొద్ది సేపటికి వాళ్లు ఆమె తల్లికి ఫోన్ చేసి, ఆడిషన్ కోరారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరకు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ‘ఉప్పెన’ చిత్రానికి కృతి శెట్టిని హీరోయిన్గా ఫైనల్ చేశారు.“అన్నీ చకా చకా జరిగిపోయాయి… నిజంగా నమ్మలేకపోయాను,” అని కృతి నవ్వుతూ చెప్పింది. ‘ఉప్పెన’ చిత్రంతో బాక్సాఫీస్‌ను దుమ్ములేపిన కృతి శెట్టిని ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. కానీ ఆ తర్వాత ఆమెకు అనుకున్నంతగా హిట్స్ రావడం లేదు.
శ్యామ్ సింగా రాయ్ (నాని), బంగార్రాజు (నాగ చైతన్య) పర్వాలేదనిపించిన ఆ తర్వాత వచ్చిన ది వారియర్ (రామ్), మాచర్ల నియోజకవర్గం (నితిన్), కస్టడీ (చై), ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (సుధీర్ బాబు), మనమే (శర్వా).. ఈ చిత్రాలేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో కృతి కెరీర్ కొంత మందగించింది. కొంత గ్యాప్ తర్వాత కృతి ప్రస్తుతం తమిళంలో రెండు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. వా వాతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే చిత్రాలు చేస్తుండగా ఇవి త్వరలోనే థియేటర్లలోకి రానున్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్స్‌పై తమిళ ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. రెంటితోనైనా కృతి మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వస్తుందా అన్నది ఇప్పుడు అభిమానుల ఆసక్తికర చర్చగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

