Soldier Movie | భారత సైనికులకు నివాళిగా ‘సోల్జర్ 24×7 ఆన్ డ్యూటీ’.. ఫస్ట్ లుక్ విడుదల!
Soldier | కొనంకి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక యాక్షన్ థ్రిల్లర్ "సోల్జర్ – 24×7 ఆన్ డ్యూటీ" చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అధికారికంగా విడుదలైంది.
Konanki Karthik | కొనంకి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక యాక్షన్ థ్రిల్లర్ “సోల్జర్ – 24×7 ఆన్ డ్యూటీ” చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అధికారికంగా విడుదలైంది. దేశభక్తి, ధైర్యం, త్యాగం, కర్తవ్య నిబద్ధత నేపథ్యంతో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ పోస్టర్లో హీరో కొనంకి కార్తీక్ శక్తివంతమైన సైనికుడి పాత్రలో కనిపించి ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. యుద్ధ వాతావరణం, పోరాట ఛాయలు, గర్వంగా రెపరెపలాడుతున్న భారత త్రివర్ణ పతాకం మధ్య ఆయన లుక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. దేశ సరిహద్దుల్లో నిరంతరం విధులు నిర్వహిస్తూ, దేశ భద్రత కోసం అహర్నిశలు కృషి చేసే భారత సైనికులకు ఈ చిత్రం ఒక ఘన నివాళిగా నిలవనుందని చిత్ర బృందం పేర్కొంది.
ఈ సినిమాలో కొనంకి కార్తీక్ సరసన ప్రియాంక వర్మ కథానాయికగా నటిస్తోంది. శ్రద్ధ ఖత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె. వి. నాయుడు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. యాక్షన్, భావోద్వేగాలు, దేశభక్తి, మానవీయ విలువల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సందీప్ బద్దుల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, నవీన్ వడ్త్యావత్ లైన్ ప్రొడ్యూసర్‌గా, తొకల వెంకట కిషోర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, పి. జగదీష్ సీఈఓగా మరియు తేజస్వి సజ్జ పీఆర్ఓగా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

