షూటింగ్లో మరోసారి గాయపడ్డ కోలీవుడ్ స్టార్ హీరో
KOLLYWOOD | కోలీవుడ్ స్టార్ హీరో అరుణ్ విజయ్ మరోసారి షూటింగ్లో ప్రమాదానికి గురయ్యాడు. లండన్‌లో అచ్చం ఎన్బదు ఇళయై సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన గాయపడ్డాడు.
కోలీవుడ్ స్టార్ హీరో అరుణ్ విజయ్ మరోసారి షూటింగ్లో ప్రమాదానికి గురయ్యాడు. లండన్‌లో అచ్చం ఎన్బదు ఇళయై సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన గాయపడ్డాడు. ఈ విషయాన్ని అరుణ్ విజయ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అరుణ్ విజయ్ హీరోగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో అచ్చం ఎన్బదు ఇళయై అనే చిత్రం తెరకెక్కుతోంది. ఎమీ జాక్సన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్‌లో జరుపుకుంటుంది. యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో అరుణ్ విజయ్ గాయపడ్డాడు. దీంతో ఇండియాకు తిరిగివచ్చిన విజయ్ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నాడు.
ఈ విషయాన్ని అరుణ్ విజయ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘ మోకాళ్లకు అయిన గాయానికి సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతిలో చికిత్స చేయించుకుంటున్నాను. ఇది నా నాలుగో రోజు చికిత్స. షూటింగ్‌కి త్వరలో తిరిగి వస్తాను.’ అని అరుణ్ విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.
అచ్చం ఎన్బదు ఇళయై సినిమా చిత్రీకరణ సమంయలోనే అరుణ్ విజయ్ గతంలో రెండు సార్లు గాయపడ్డాడు. గత ఏడాది అక్టోబర్‌లో మోకాలికి గాయమవ్వగా.. నవంబర్‌లో చేతులకు గాయమైంది. ఇప్పుడు మూడోసారి కూడా గాయపడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్ సీన్స్ టైమ్‌లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

