Devil Movie | బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) నుంచి వస్తున్న తాజా చిత్రం డెవిల్ (Devil). ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన కల్యాణ్‌రామ్, మాళవిక నాయర్, ఎల్నాజ్ నొరౌజీ ఫస్ట్ లుక్ పోస్టర్లు.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మూవీ నుంచి కొన్నాళ్లుగా ఎలాంటి అప్డేట్స్ రాలేదు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొత్త న్యూస్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం నయా అప్డేట్ బయటకు వచ్చింది.
మొదట ఈ మూవీని నవంబర్ 24న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమాని వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మళ్లీ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను డిసెంబర్ 29న పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
#NandamuriKalyanRam‘s much awaited spytacular entertainer, #DevilTheMovie, gets a release date!
The secret agent story of the year to release on December 29th!#DevilOnDec29th #Devil – The British Secret Agent
డెవిల్ – डेविल – டெவில் – ಡೆವಿಲ್ – ഡെവിൽ@NANDAMURIKALYAN… pic.twitter.com/G7h212JFmF— Vamsi Kaka (@vamsikaka) December 7, 2023
ఇక దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా డెవిల్ ముసుగేసుకుని బ్రిటీషర్ల కోసం కళ్యాణ్‌రామ్ ఎందుకు పని చేశాడనే కాన్సెప్ట్‌తో పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. లుక్స్ పరంగా కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో చాలా బాగున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇక ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహించాడు. అయితే అనూహ్యంగా రీసెంట్గా రిలీజైన పోస్టర్లలో ఆయన పేరు కనిపిచండం లేదు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న అభిషేక్ నామా పేరు దర్శకుడిగా కనిపిస్తుంది.