పాన్ ఇండియా హీరో యశ్ (Yash), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో వచ్చిన కన్నడ సినిమా కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2). పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన కేజీఎఫ్ చాఫ్టర్ 2 ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై రికార్డుల వర్షం కురిపించింది. సిల్వర్ స్క్రీన్‌పై ఫుల్ ఎంజాయ్ చేసిన ప్రేక్షకులకు ఇపుడు మరోసారి థ్రిల్ అందించేందుకు రెడీ అవుతోంది. కేజీఎఫ్ చాఫ్టర్ 2 అందరి ఇళ్లలో సందడి చేసేందుకు ముస్తాబైంది.
కేజీఎఫ్ చాఫ్టర్ 2 శాటిలైట్ హక్కులను జీ తెలుగు భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ చిత్రం 2022 ఆగస్టు 21 (ఆదివారం) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రీమియర్ కానుందని ప్రకటించింది జీ ఛానల్. సదరు ఛానల్ కేజీఎఫ్ చాఫ్టర్ 2 సినిమాకు సంబంధించిన 80 అడుగుల ప్రత్యేక బ్యానర్‌ను లాంఛ్ చేస్తూ ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. ఇపుడీ భారీ పోస్టర్ స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
కన్నడ, తెలుగు, హిందీతోపాటు పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.1000 కోట్ల మైల్ స్టోన్‌ను క్రాస్ చేసింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి ఫీ మేల్ లీడ్ రోల్లో మెరిసింది. బాలీవుడ్ యాక్టర్లు సంజయ్ దత్, నటి రవీనాటాండన్ తోపాటు ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు.
Date locked for ROCKY BHAI'S Arrival 🔥
Watch World Television Premiere #KGFChapter2 August 21st Sunday at 5:30 PM only on #ZeeTelugu#KGFChapter2OnZeeTelugu #KGF2OnZeeTelugu@TheNameIsYash @prashanth_neel @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 pic.twitter.com/tH6rV6mX4f
— ZEE TELUGU (@ZeeTVTelugu) August 11, 2022