KGF 2: అఫీషియల్.. శాటిలైట్ హక్కులు ఆ సంస్థకే..!

ఈ మధ్య కాలంలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చర్చనీయాంశంగా మారుతుంది. హీరో, దర్శకుడు క్యాస్టింగ్ని బట్టి సినిమాపై క్రేజ్ అమాంతం పెరగడంతో పెట్టుబడితో సంబంధం లేకుండా థ్రియేట్రికల్ రైట్స్ నుంచి.. డిజిటల్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ఇలా ప్రతీది కళ్లు చెదిరే రేట్లకు సేల్ అవుతుంది. కేజీఎఫ్ సిక్వెల్ గా తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండగా, ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతున్నట్టు తెలుస్తుంది.
తాజాగా కేజీఎఫ్ 2 చిత్ర సంస్థ.. సౌత్ లాంగ్వేజెస్కి సంబంధించిన శాటిలైట్ రైట్స్ జీ సంస్థకు అప్పగించినట్టు అఫీషియల్ ప్రకటన చేశారు. అయితే శాటిలైట్ హక్కుల కోసం చిత్ర నిర్మాణ సంస్థకు జీ బాగానే ముట్టజెప్పినట్టు తెలుస్తుంది. కన్నడ సూపర్ స్టార్ యశ్ హీరోగా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన కేజీఎఫ్ 2 సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచి పోయింది. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీపై మొదటి నుంచి భారీగా అంచనాలు ఉండగా టీజర్ విడుదలైన తరువాత ఆ అంచనాలు భారీగా పెరిగాయి. కేజీఎఫ్ ఛాప్టర్ 1తో పోల్చి చూస్తే ఆరేడు రెట్లు ఎక్కువగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. యశ్ ఈ సినిమాకు 30 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నాడని తెలుస్తోంది. కేజీఎఫ్ ఛాప్టర్ 1 కు 11 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్న యశ్ ఛాప్టర్ 2కు మాత్రం భారీ మొత్తం పారితోషికంగా అందుకున్నట్టు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

