KR Jayachandran | నాలుగేళ్ల బాలికపై అత్యాచారం ఆరోపణలు.. నటుడిపై పోలీసుల లుక్ అవుట్ నోటీస్..!
KR Jayachandran | పోక్సో కేసులో పరారీలో ఉన్న మలయాళ నటుడు కేఆర్ జయచంద్రన్‌పై కేరళ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశారంటూ ఆయనపై ఆరోపణలున్నాయి.
KR Jayachandran | పోక్సో కేసులో పరారీలో ఉన్న మలయాళ నటుడు కేఆర్ జయచంద్రన్‌పై కేరళ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశారంటూ ఆయనపై ఆరోపణలున్నాయి. గతేడాది కోజికోడ్‌లోని కసాబా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆయనపై కేసు నమోదైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక దాడి, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలను మోపారు. ఈ కేసులో అరెస్టు చేయకుండా జయచంద్రన్ హైకోర్టును ఆశ్రయించారు.
ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అంతకు ముందు కోజికోడ్ సెషన్స్ కోర్టు సైతం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ క్రమంలో జయచంద్రన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు కోజికోడ్ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన పరారయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆయన గురించి సమాచారం తెలిస్తే కోజికోడ్‌లోని కసబా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

