Keerthy Suresh | స్ఫూర్తిదాయక మహిళా పోరాటంమే రఘు తాత: కీర్తి సురేశ్
‘దృఢ సంకల్పం ఉన్న ఓ మహిళ చేసే స్ఫూర్తిదాయక పోరాటమే ‘రఘు తాత’ సినిమా..’ అని నటి కీర్తి సురేశ్ అంటున్నది. సుమన్ కుమార్ దర్శకత్వంలో ఆమె నటించిన ‘రఘు తాత’ చిత్రం ఆగస్ట్ 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
Keerthy Suresh | ‘దృఢ సంకల్పం ఉన్న ఓ మహిళ చేసే స్ఫూర్తిదాయక పోరాటమే ‘రఘు తాత’ సినిమా..’ అని నటి కీర్తి సురేశ్ అంటున్నది. సుమన్ కుమార్ దర్శకత్వంలో ఆమె నటించిన ‘రఘు తాత’ చిత్రం ఆగస్ట్ 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాపై రాజకీయ వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో కీర్తి సురేశ్ క్లారిటీ ఇచ్చింది. ఇటీవలే చెన్నయ్లో జరిగిన ఈ సినిమా పాటల వేడుకలో ఆమె మాట్లాడుతూ- ‘ఇది విభిన్నమైన కథ. ఓ మహిళ ఎదుర్కొనే సవాళ్లే ఈ సినిమా ఇతివృత్తం.
ఇందులో మంచి సందేశం ఉంది. గొప్ప వినోదం ఉంది. అందరూ అనుకుంటున్నట్టు ఇందులో రాజకీయ అంశాలేం లేవు. ఇది పూర్తి కామెడీ సినిమా’ అంటూ చెప్పుకొచ్చింది కీర్తిసురేశ్. ఇంకా చెబుతూ ఈ సినిమాలోని పాటలు నాకు చాలా ఇష్టం. తప్పకుండా అందరికీ నచ్చుతాయి.’ అని తెలిపింది కీర్తి సురేశ్. ప్రముఖ నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న తొలి తమిళ సినిమా ఇదే కావడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

