కీర్తి త్రిభాషా చిత్రం

సామాజిక సందేశం, బలమైన భావోద్వేగాలు కలబోసిన మహిళా ప్రధాన చిత్రాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు అగ్ర కథానాయికలు. పాత్రలపరంగా సవాళ్లను స్వీకరిస్తూ తమ ప్రతిభను చాటుకోవాలని తాపత్రయపడుతున్నారు. తాజాగా చెన్నై చిన్నది కీర్తి సురేష్ హిందీ ‘మిమి’ చిత్ర దక్షిణాది భాషల రీమేక్‌లో నటించబోతున్నట్లు తెలిసింది. కృతిసనన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మిమి’ చిత్రం ఇటీవలే ఓటీటీ ద్వారా విడుదలైన విమర్శకుల్ని మెప్పించింది. అదె ్దగర్భం ధరించిన ఓ మహిళా జీవన ప్రయాణానికి, మానసిక సంఘర్షణకు అద్దం పడుతూ హృద్యమైన భావోద్వేగాలతో ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పునర్నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. హిందీ మాతృక ఎంతగానో ఆకట్టుకోవడంతో ఆ పాత్రకు తాను పూర్తిస్థాయిలో న్యాయం చేయగలననే నమ్మకంతో ఉందట కీర్తిసురేష్. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో మహేష్‌బాబు సరసన ‘సర్కారు వారి పాట’చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

