Tholi Prema | అమితాబ్ బచ్చన్‌కు చిరాకు తెప్పించిన తొలిప్రేమ క్లైమాక్స్.. కరుణాకరన్ మాటల్లోనే..
Karunakaran | టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సినిమాల్లో టాప్ ప్లేస్‌లో ఉంటుంది తొలి ప్రేమ (Tholiprema) .శనివారం ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తొలిప్రేమ గురించి ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు డైరెక్టర్ కరుణాకరన్ (Karunakaran).
Karunakaran | టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సినిమాల్లో టాప్ ప్లేస్‌లో ఉంటుంది తొలిప్రేమ (Tholiprema) . ఈ మూవీ పవన్ కల్యాణ్ కెరీర్లో వన్ ఆఫ్ ది మెమురబుల్ చిత్రంగా నిలిచింది. తొలి ప్రేమ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. శనివారం ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. రీరిలీజ్‌లో కూడా మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. కరుణాకరన్ (Karunakaran) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తిరెడ్డి హీరోయిన్గా నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తొలిప్రేమ గురించి ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు కరుణాకరన్.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan) సినిమా క్లైమాక్స్ చూస్తున్నప్పుడు చాలా చిరాకుపడ్డారని చెప్పాడు కరుణాకరన్. ఈ సంఘటన గురించి కరుణాకరన్ మాట్లాడుతూ.. హీరోయిన్ను ఎంతగానో ప్రేమించే పవన్ కల్యాణ్ క్లైమాక్స్ టైంలో కూడా తన ప్రేమ విషయాన్ని హీరోయిన్‌తో చెప్పలేకపోతూ తనలో తానే మదనపడే సన్నివేశాలు చాలా మంది ప్రేక్షకులను మింగుడుపడదు. అయితే క్లైమాక్స్ చూస్తున్నప్పుడు బిగ్‌బీ ఫీలింగ్ కూడా ఇదేనట.
తొలిప్రేమ క్లైమాక్స్ లో చివరి నిమిషంలో కూడా హీరో తన ప్రేమను హీరోయిన్‌తో చెప్పలేకపోవడంతో సినిమా చూస్తున్న అమితాబ్ బచ్చన్ జీ చిరాకుతో కోపంగా తన కారు తాళపు చెవిని స్క్రీన్‌వైపు విసిరేశారు. అయితే క్లైమాక్స్‌లో హీరోయిన్ వెనక్కి తిరిగి హీరో దగ్గరకు రాగానే.. అమితాబ్ పక్కనే కూర్చున్న జయా బచ్చన్ మేడమ్ సంతోషంలో చప్పట్లు కొట్టేశారని చెప్పుకొచ్చాడు కరుణాకరన్. ఈ ఘటన గురించి చెన్నైలో కలిసినప్పుడు అమితాబ్ బచ్చన్ తనతో అన్నారని చెప్పుకొచ్చాడు. కరుణాకరన్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

