రెండేళ్ల విరామం తర్వాత హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘కమ్‌బ్యాక్’. విశేషమేమిటంటే ఈ సినిమా ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సోమవారం కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటిస్తూ స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఆయన సతీమణి లోహితా రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘మూడేళ్ల నుంచి ఏమైపోయాడో తెలియలేదు. ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడు? అనే వాయిస్ ఓవర్‌తో మొదలైన గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో హీరో కార్తికేయ బాక్సర్‌గా కనిపించారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీశ్ చీకటి, సంగీతం: విజయ్ బుల్గానిన్, దర్శకత్వం: కార్తికేయ గుమ్మకొండ.