Karthikeya: సీక్రెట్‌గా నిశ్చితార్థం జరుపుకున్న ఆర్ఎక్స్ 100 హీరో

2020లో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. కరోనా వలన వీరి పెళ్లి వేడుకలు ఎలాంటి సందడి లేకుండా ముగిసాయి. ఇక ఈ ఏడాది మొదట్లో కూడా కొందరు ప్రముఖులు సింపుల్‌గా వివాహం చేసుకున్నారు. ఇక తాజాగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ హీరో కార్తికేయ ఎలాంటి హడావిడి లేకుండా నిశ్చితార్ధం చేసుకున్నారు. త్వరలో ఆయన ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం కార్తికేయ నిశ్చాతార్ధానికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్లో కార్తికేయ నిశ్చితార్థం జరగగా, ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారట. పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే కార్తికేయ చేసుకోబోయే అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కార్తికేయ హీరోగానే కాకుండా విలన్ పాత్రలు పోషిస్తున్నారు. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్‌లీడర్’లో కార్తికేయ విలన్‌గా నటించారు. అజిత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘వలిమై’లోను నెగెటివ్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం కార్తీయేక “రాజా విక్రమార్క” సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానుంది. ఆ తరువాత కార్తికేయ యూవి క్రియేషన్స్‌తో కలిసి ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కోసం పని చేయబోతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- engagement
- Karthikeya
- rx 100
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

