విషమిస్తున్న సీనియర్ నటుడి ఆరోగ్యం..!

సీతాకోకచిలక సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైన నటుడు కార్తీక్. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేసాడు ఇక్కడ. అలాగే తమిళనాట స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చకున్నాడు. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ నటించాడు ఈయన. ఇప్పుడు ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఈయన హాస్పిటల్లోనే ఉన్నాడు. ఈ మధ్యే తీవ్ర అనారోగ్యంతో బాధ పడిన కార్తీక్.. కొన్ని రోజుల తర్వాత కోలుకున్నాడు. అయితే మళ్లీ ఇప్పుడు అనారోగ్యం తిరగబెట్టింది. ఈ మధ్యే తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మరోసారి అనారోగ్యం పాలయ్యాడు. దాంతో వెంటనే హస్పిటల్లో చేర్పించారు కుటుంబ సభ్యులు.
నటుడిగా బిజీగా ఉన్న ఈయన.. రాజకీయాల్లోకి రావడమే కాకుండా సొంతంగా పార్టీ కూడా పెట్టాడు. కానీ అనారోగ్య కారణాలతో ఆ పార్టీని రద్దు చేసాడు. మొన్నటి ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించాడు . అంతేకాదు పార్టీ తరఫున ప్రచారం కూడా చేసాడు. ఈ క్రమంలోనే అనారోగ్యం పాలయ్యారు. ఆయన్ని అడయార్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ హీరో ప్రస్తుతం శ్వాసకోస సంబంధిత సమస్యతో బాధ పడుతున్నాడు.ఇప్పుడు ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుంది. కార్తీక్కు బీపీ కూడా ఎక్కువైనట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికీ ఈయన హాస్పిటల్లోనే ఉన్నాడు.
కార్తీక్ ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉండడంతో అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై అధికారిక సమాచారం బయటికి రావాల్సి ఉంది. ఈయన ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చ్ 21న ఆసుపత్రిలో చేరిన కార్తీక్.. ఆ తర్వాత కొన్ని రోజులు వైద్యం తీసుకున్నాక డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన్ని విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కానీ ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో మళ్లీ అనారోగ్యం తిరగబెట్టినట్టు తెలుస్తుంది. తాజాగా ఈయన హెల్త్ బులెటిన్ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Health
- karthik
- senior actor
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

