సిరిమల్లె పువ్వులాంటి సినిమా
‘ఇప్పడంటే తెలుగు సినిమా భారీ తనానికి కేరాఫ్ అడ్రస్ అయ్యిందికానీ.. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కె.విశ్వనాథ్‌గారి సినిమాలు. పెద్ద వంశీగారి సినిమాలు. మనసుల్ని మెలిపెట్టే భావోద్వేగాలను వారి సినిమాల్లో చూశాం.
‘ఇప్పడంటే తెలుగు సినిమా భారీ తనానికి కేరాఫ్ అడ్రస్ అయ్యిందికానీ.. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కె.విశ్వనాథ్‌గారి సినిమాలు. పెద్ద వంశీగారి సినిమాలు. మనసుల్ని మెలిపెట్టే భావోద్వేగాలను వారి సినిమాల్లో చూశాం. అలాంటి సినిమాలు ఈ రోజుల్లో చేయడం కుదరదా అనుకుంటున్న టైమ్‌లో ‘96’ డైరెక్టర్ ప్రేమ్‌కుమార్ రాసుకున్న కథను చదివాను. ఆనందంతో కన్నీళ్లొచ్చాయి. అన్నయ్యకి ఈ స్క్రిప్ట్ ఇచ్చాను. ఆయన చదివి ఎమోషన్ అయ్యారు. ఇలాంటి కథలు నీకే ఎలా దొరుకుతాయి? అన్నారు.
ఇందులో మరోముఖ్యమైన పాత్రను అరవింద్‌స్వామి చేశారు. కమల్‌హాసన్ స్థాయిలో నటించారాయన. ‘ఖైదీ’లా నైట్ షూట్ ఉండే కథ ఇది. డైరెక్టర్ ప్రేమ్‌కుమార్ ప్లాన్డ్గా షూట్ చేశారు. ఇప్పటివరకూ చూడని కజిన్స్ ఎమోషన్‌తో తెరకెక్కిన కథ ఇది. మాకంటే ఒకరోజు ముందు బ్రదర్ తారక్ ‘దేవర’ రాబోతున్నది. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.
‘దేవర’ వార్ ఫైర్ లాంటి సినిమా. మనది సిరిమల్లె పువ్వులాంటి బ్యూటిఫుల్ సినిమా. మనసుపెట్టి చేశాం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది.’ అని హీరో కార్తీ అన్నారు. కార్తీ, అరవింద్‌స్వామి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘సత్యం సుందరం’. ‘96’ఫేం సి.ప్రేమ్‌కుమార్ దర్శకుడు. సూర్య, జ్యోతిక నిర్మాతలు. ఏషియన్ సురేశ్ ఎంటైర్టెన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో కార్తీ మాట్లాడారు. ఈ సినిమా తనకెంతో ప్రత్యేమని, ఆర్య, జగడం సినిమాలకు దర్శకత్వశాఖలో పనిచేశానని, తన కెరీర్ టాలీవుడ్లోనే మొదలైందనీ దర్శకుడు ప్రేమ్‌కుమార్ గుర్తు చేసుకున్నారు. ఇంకా నటి శ్రీదివ్య, నిర్మాత సురేశ్‌బాబు, రచయిత రాకేందుమౌళిలతోపాటు అతిథులుగా విచ్చేసిన విశ్వక్సేన్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

