పాటతో మనసుల్ని టచ్ చేశాడు
తమిళ హీరో కార్తీ తెలుగు చక్కగా మాట్లాడతారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా పాటే పాడేశారు.
తమిళ హీరో కార్తీ తెలుగు చక్కగా మాట్లాడతారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా పాటే పాడేశారు. ఆయన రాబోతున్న ‘జపాన్’ సినిమాలో ‘టచ్చింగ్ టచ్చింగ్..’ అంటూ జి.వి.ప్రకాశ్‌కుమార్ స్వరపరిచిన పాటను ఇంద్రావతి చౌహాన్‌తో కలిసి పాడేశారు కార్తీ. కార్తీ వాయిస్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్‌కుమార్ అన్నారు.
మాస్ మెచ్చే విధంగా భాస్కరభట్ల రచించిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు రాజు మురుగన్ చెప్పారు. ‘జపాన్’ కథ, కార్తీ గెటప్, ఆయన మేనరిజమ్స్, అను ఇమ్మాన్యుయేల్‌తో కార్తీ కెమిస్ట్రీ ఇవన్నీ సినిమాను ప్రధానబలాలని ఆయన అన్నారు. కేఎస్.రవికుమార్, సునీల్, విజయ్ మిల్టన్ ప్రత్యేకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా ఎస్.రవివర్మన్. నిర్మాతలు ఎస్.ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

