‘కుటుంబ భావోద్వేగాలతో కూడుకున్న కథ ‘కర్మేని సెల్వం’. సంగీత దర్శకునిగా నా కెరీర్‌కి ఈ సినిమా ఓ టర్నింగ్ పాయింట్. ఈ సినిమా మ్యూజిక్ ఇంతబాగా రావడానికి కారణం టీమ్ వర్క్’ అని సంగీత దర్శకుడు రామానుజన్ ఎంకే అన్నారు. సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కర్మేని సెల్వం’. గౌతమ్ వాసుదేవమీనన్ కీలక పాత్ర పోషించారు. రామ్‌చక్రి దర్శకుడు. అరుణ్ రంగరాజులు నిర్మాత. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన రామానుజన్ చిత్ర విశేషాలను వెల్లడించారు.
ఇంకా చెబుతూ ‘భావోద్వేగపూరితమైన కథలకు సంగీతం అందించడం కష్టం. సముద్రఖని, గౌతమ్ మీనన్, దర్శక,నిర్మాతలు.. ఇలా అందరూ సపోర్ట్ చేయడం వల్లే ఇది సాధ్యమైంది. ‘కర్మేని సెల్వం’ మనసులకు హత్తుకునే సినిమా. ప్రతి ఒక్కరి జీవితాలను ప్రతిబింబిస్తుంది’ అని తెలిపారు రామానుజన్. తెలుగులో ఆనంద్, హ్యపీడేస్, గోదావరి వంటి ఫీల్‌గుడ్ సినిమాలకు సంగీతం అందించాలనేది తన డ్రీమ్ అని ఈ సందర్భంగా రామానుజన్ చెప్పారు.