Karate Kalyani | హేమ లాంటి వారు తీవ్రవాదుల కన్నా ప్రమాదం : కరాటే కళ్యాణి
Karate Kalyani | టాలీవుడ్ నటి హేమ ఇటీవల బెంగుళూరులో రేవ్ పార్టీలో పట్టుబడిన విషయం తెలిసిందే. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీకి సినీ నటి హేమతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో ఉన్నది తాను కాదని తనకు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ హేమ వీడియో విడుదల చేసింది.
Karate Kalyani | టాలీవుడ్ నటి హేమ ఇటీవల బెంగుళూరులో రేవ్ పార్టీలో పట్టుబడిన విషయం తెలిసిందే. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీకి సినీ నటి హేమతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో ఉన్నది తాను కాదని తనకు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ హేమ వీడియో విడుదల చేసింది. అయితే ఈ పార్టీకి వచ్చిన హేమ తన అసలు పేరును కృష్ణవేణిగా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఆమె వీడియో వైరల్ అయ్యాకే హేమగా గుర్తించామని బెంగుళూరు కమిషనర్ అధికారికంగా ప్రకటించారు.
అయితే తాజాగా ఈ ఘటనపై టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి స్పందించింది. కరాటే కళ్యాణికి, హేమాకు మొదటినుంచి గొడవ ఉన్న విషయం తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో ఎదురెదురు నిలబడి ఒకరిని ఒకరు ఏకిపారేసుకున్నారు. ఆ తర్వాత కళ్యాణి పేకాట ఆడుతుందంటూ హేమా సంచలన ఆరోపణలు చేసింది. దీంతో వీరిద్దరి మధ్య వివాదం ముదురుతూ వచ్చింది. అయితే రేవ్ పార్టీలో హేమ పట్టుబడటంపై కరాటే కళ్యాణి తాజాగా మాట్లాడుతూ.. హేమ లాంటి వారు తీవ్రవాదుల కన్నా ప్రమాదం, నేను అప్పట్లో పేకాట ఆడుతూ దొరికానంటూ హేమ నన్ను బజారుకీడ్చింది. ఇప్పుడు ఈమె రేవ్ పార్టీలో డ్రగ్స్‌తో దొరికింది. ఇది నిజం అని నిర్ధారణ అయ్యాక పోలీసులు ఆమెకు శిక్ష వేస్తారు. మా అసోషియేషన్ తరపున కూడా ఆమె పైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాము అని కరాటే కళ్యాణి వెల్లడించింది.
మరోవైపు రేవ్ పార్టీ కేసులో పోలీసుల విచారణలో భాగంగా హేమకి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా.. ఈ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. డ్రగ్స్ టెస్ట్‌లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హేమతో పాటు డ్రగ్స్ టెస్ట్‌లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు ప్రకటించారు. హేమను బాధితురాలుగా పరిగణించే అవకాశముంది. హేమను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశముందని సమాచారం. ఇక ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

