Kangana Ranaut | అమీర్‌ఖాన్‌పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా విమర్శలు..!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. నాగ చైతన్య కీలకపాత్రలో నటించాడు. హాలీవుడ్లో సూపర్ హిట్టయిన ‘ది ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ క్రమంలో లాల్ సింగ్ చడ్డా చిత్రాన్ని బహిష్కరించాలంటూ గత కొన్నిరోజులగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసందే. దీనిపై ఇటీవలే అమీర్ స్పందించి నా సినిమాకు వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. దయచేసి నా సినిమా చూడండి. బహిష్కరించొద్దంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో అమీర్‌ను విమర్శిస్తూ ఓ పోస్ట్ చేసింది.
‘లాల్ సింగ్ చడ్డా సినిమాపై వ్యతిరేక ప్రచారం వెనుక అమీర్‌ఖాన్ మాస్టర్ మైండ్ ఉంది. ఈ ఏడాది హిందీ సినిమాలు బాగా ఆడలేదు. సౌత్ సినిమాలే ఇండియా కల్చర్‌ను అద్దం పట్టి సక్సెస్‌ను సాధించాయి. ఈ క్రమంలో ఒక హాలీవుడ్ రీమేక్ ఎలాగూ ఆడదు. హిందీ సినిమాలు ప్రేక్షకుల పల్స్‌ను అర్థం చేసుకోవాలి. ఇది హిందువు లేదా ముస్లిం అని కాదు. అమీర్‌ఖాన్ హిందూ ఫోబిక్ ‘పీకే’ తీసినా, ఇండియాలో అసహనం ఎక్కువైందని అన్నప్పటికి అతని సినిమాలు హిట్టయ్యాయి. ఇప్పుడు దీనిని మత అంశంగా చిత్రీకరించడం ఆపండి’ అంటూ అమీర్‌పై విమర్శలు కురిపించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

