Kamal Hassan | విజయ్ రాజకీయాలపై కమల్ హాసన్ కామెంట్స్… నెటిజన్ల విమర్శలు
Kamal Hassan | తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న నేపథ్యంలో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి.
Kamal Hassan | తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న నేపథ్యంలో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. రీసెంట్గా మీడియాతో మాట్లాడిన కమల్ హాసన్ తన సినిమా, రాజకీయ ప్రయాణంపై పలు విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా, తమిళనాడులో డీఎంకేతో పొత్తు చర్చలు జరుగుతున్న సమయంలో, తమిళగ వెట్రి కగజం పార్టీ అధినేత విజయ్ గురించి విలేకరులు ప్రశ్నించారు.
విజయ్ పెరంబూర్ నుంచి పోటీ చేసే అవకాశాలపై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా, కమల్ హాసన్ నవ్వుతూ, “నాకెందుకు ఆ విషయం? నాకు చాలా పనులు ఉన్నాయి, వాటిపైనే దృష్టి పెట్టాలి” అని సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. కమల్ హాసన్ స్పందనపై అనేక మంది నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే రంగానికి చెందిన నటుడు రాజకీయాల్లోకి అడుగుపెడుతుంటే కనీసం అభినందనలు తెలపాల్సిందిగా కొందరు అభిప్రాయపడ్డారు. ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? , తోటి నటుడికి కనీసం శుభాకాంక్షలు చెప్పలేరా? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు, తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై గతంలో వచ్చిన వివాదాలు మళ్లీ చర్చకు వచ్చాయి. రాజకీయాల్లోకి రావాలని భావించినప్పటికీ ఆరోగ్య కారణాలతో ఆయన వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమల్ హాసన్ .. డీఎంకే తో సీట్ల సర్దుబాటు చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. చర్చలు ఇంకా జరుగుతున్నాయి, తుది నిర్ణయం వచ్చిన తర్వాత వెల్లడిస్తాం అని తెలిపారు. సీట్ల సంఖ్య కంటే కూటమి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కగజం ద్వారా ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో సినీ నటులకు రాజకీయాల్లో మంచి ఆదరణ ఉండటంతో విజయ్ రాజకీయ ఆరంగేట్రం కూడా ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

