సేనాపతి రాజీలేని పోరాటం
కమల్‌హాసన్-శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ (1996) చిత్రం విమర్శకుల ప్రశంసలందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిపై సేనాపతి చేసిన పోరాటం అందరిని ఆకట్టుకుంది.
కమల్‌హాసన్-శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ (1996) చిత్రం విమర్శకుల ప్రశంసలందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిపై సేనాపతి చేసిన పోరాటం అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ‘భారతీయుడు-2’ ప్రపంచవ్యాప్తంగా జూలై 12న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రచారపర్వంలో వేగాన్ని పెంచారు. బుధవారం నాడు ‘శౌర..’ అనే లిరికల్సాంగ్ను విడుదల చేశారు. సుద్దాల అశోక్‌తేజ రాసిన ఈ గీతానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలను సమకూర్చారు. రితేజ్ జి రావు, శృతికా సముద్రాల ఆలపించారు. పాటలోని విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సీక్వెల్లో స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి పోరాటం మరోస్థాయిలో ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఎస్.జె. సూర్య, సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీశంకర్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్, జయరాం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహా, బ్రహ్మానందం, జాకీర్ హుస్సేన్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, కెమెరా: రవివర్మన్, ఎడిటింగ్: ఎ.శ్రీకర్‌ప్రసాద్. నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

