Kamal Haasan | కమల్ హాసన్ ప్రాజెక్ట్-Kలో నటించడానికి కారణం అదేనా..!
Project-K Movie | రెండేళ్లుగా అందరినీ ఆలోచనలో పడేసిన ప్రాజెక్ట్-K మిస్టరీ వీడింది. కొన్ని గంటల ముందు రిలీజైన ప్రాజెక్ట్-K గ్లింప్స్ అందరినీ ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఒక తెలుగు సినిమాలో ఆ రేంజ్ విజువల్స్ చూసి అందరు షాక్ అవుతున్నారు.
Project-K Movie | రెండేళ్లుగా అందరినీ ఆలోచనలో పడేసిన ప్రాజెక్ట్-K మిస్టరీ వీడింది. కొన్ని గంటల ముందు రిలీజైన ప్రాజెక్ట్-K గ్లింప్స్ అందరినీ ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఒక తెలుగు సినిమాలో ఆ రేంజ్ విజువల్స్ చూసి అందరు షాక్ అవుతున్నారు. అలాంటి విజువల్స్ నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అంటూ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా నెగిటివిటీని ప్రచారం చేసే ట్రోలర్ బ్యాచ్ గ్లింప్స్ చూసి అతలా కుతలం అవుతుంది. మధ్య రాత్రి రిలీజైన గ్లింప్స్ అసలు నెగిటివిటీకి ఎక్కడా తావివ్వకుండా ఉంది. ఇక ప్రభాస్‌ను ఆ లుక్‌లో చేసే సరికి ఫ్యాన్స్ సంబురం అంతా ఇంతా కాదు. పొరపాటున ఎక్కడైన నాగ్ అశ్విన్ కనిపిస్తే మట్టుకు పూజలు పురస్కారాలు వంటివి చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
హాలీవుడ్ సినిమాను తలదన్నే రీతిలో నాగ్ అశ్విన్ ఈ సినిమా తీస్తున్నాడని అందరూ ఫిక్సయిపోయారు.ఇక ఈ సినిమా టైటిల్, గ్లింప్స్‌ను శాండియా శాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్లో లాంచ్ చేశారు. ఈ వేడుకకు ప్రభాస్‌తో పాటు కమల్ హాసన్, రానా, నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీదత్ హాజరయ్యాడు. కాగా ఈ వేడుకలో కమల్ మాట్లాడుతూ తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చాడు. ‘నేను సినిమా సంబంధమైన వ్యక్తిని. సినిమాలో నెగిటివ్ లేకపోతే పాజిటివ్ ఉండదు. సో.. ఆ నెగిటివ్ రోల్ సినిమాకి చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర ఒప్పుకున్నా’ అంటూ ఈ సినిమాలో తాను భాగం కావడానికి కారణాన్ని చెప్పుకొచ్చాడు.
కమల్ వంటి బిగ్గెస్ట్ స్టార్‌ను విలన్‌గా ఎలా ఒప్పించగలిగారన్న మిలియన్ డాలర్ ప్రశ్నకు కమల్ హాసనే స్వయంగా క్లారిటీ ఇచ్చేశాడు.సై-ఫై జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నది క్లారిటీ ఇవ్వలేదు. వచ్చే ఏడాదని చెప్పారు కానీ కరెక్ట్‌గా ఇదే రోజు వస్తుందని మెన్షన్ చేయలేదు. దాంతో సంక్రాంతికి కచ్చితంగా రావట్లేదని కూడా అనుకోలేము. ఎందుకంటే సినిమా షూటింగ్ దాదాపుగా ముగింపు స్టేజ్‌కు వచ్చిందనే ఇన్సైడ్ టాక్. అయితే పోస్ట్ ప్రొడక్షన్‌కే ఎక్కువ రోజులు కావాల్సిందని టాక్. మరి ముందుగా చెప్పినట్లు సంక్రాంతికే వస్తున్నారా లేదంటే పోస్ట్ పోన్ అవుతుందా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

