కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ఉపశీర్షిక. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో అభిషేక్ నామా రూపొందిస్తున్నారు. సంయుక్తా మీనన్ కథానాయిక. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘యు.ఏ’ సర్టిఫికెట్ లభించింది. ‘పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కల్యాణ్‌రామ్ వినూత్నమైన పాత్రలో కనిపిస్తారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్ మరోస్థాయిలో ఉంటాయి. రహస్య చేధనలో గూఢచారికి ఎదురైన సవాళ్లేమిటన్నది ఉత్కంఠను కలిగిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు ‘డెవిల్’ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సౌందర్‌రాజన్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా, నిర్మాత, దర్శకత్వం: అభిషేక్ నామా.