దొంగ ప్రేమకథ కల్వన్
తమిళ సినిమాలు తెలుగులో విడుదల కావడం సాధారణమే. ఇలా విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి కూడా. కెరీర్లో మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా పేరు సంపాదించుకున్న జీవీ ప్రకాశ్‌కుమార్ హీరోగా చేసిన మరో సినిమా ‘కల్వన్'.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్: మే 14
తారాగణం: జీవీ ప్రకాశ్‌కుమార్, ఇవానా, భారతీరాజా తదితరులు
దర్శకత్వం: పీవీ శంకర్
తమిళ సినిమాలు తెలుగులో విడుదల కావడం సాధారణమే. ఇలా విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి కూడా. కెరీర్లో మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా పేరు సంపాదించుకున్న జీవీ ప్రకాశ్‌కుమార్ హీరోగా చేసిన మరో సినిమా ‘కల్వన్’. తమిళంలో తెరకెక్కి విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేయగా, ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది.
కథ: కెంబన్ అలియాస్ కెంబరాజు (జీవీ ప్రకాశ్‌కుమార్) స్నేహితుడు సూరి (దీనా)తో కలిసి అడవి పక్కనే ఉన్న చిన్న పల్లెటూరిలో జీవిస్తుంటాడు. అనాథలైన వీరిద్దరూ ఊళ్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. ఒకరోజు తన ఇంట్లో దొంగతనానికి వచ్చిన ఆ ఇద్దరిని ఇంటి యజమానురాలు బాలమణి (ఇవానా)తెలివిగా పోలీసులకు పట్టిస్తుంది.
అప్పుడే బాలమణితో ప్రేమలో పడతాడు కెంబన్. బాలమణి మెప్పు పొందడం కోసం అనాథాశ్రమంలో ఉండే ఒక వృద్ధుడి (భారతీరాజా)ని దత్తత తీసుకుంటాడు. అది నిజమని నమ్మిన బాలమణి కెంబన్తో ప్రేమలో పడుతుంది. ఇక, కెంబన్ నివసించే గ్రామంలో తరచూ ఏనుగులు, పులులు దాడి చేస్తాయి. ప్రతిసారీ ప్రాణం నష్టం జరుగుతుంది. ఓసారి గ్రామంలోకి వచ్చిన పులిని వృద్ధుడు కంట్రోల్ చేసి గ్రామస్తులకు షాక్ ఇస్తాడు. అడవి జంతువుల దాడిలో చనిపోయినవాళ్ల కుటుంబానికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందుతుంటుంది.
అలా మరణిస్తే నష్టపరిహారం వస్తుందన్న ఆశతోనే కెంబరాజు ఓ పథకం ప్రకారం వృద్ధుడిని దత్తత తీసుకున్నాడని బాలమణికి తెలిసిపోతుంది. కెంబరాజు ప్లాన్‌ను వృద్ధుడు ఎలా తిప్పికొట్టాడు? పులిని వృద్ధుడు ఎలా కంట్రోల్ చేశాడు? కెంబన్ కోసం తాత చేసిన త్యాగం ఏమిటి? అనేదే సినిమా కథ.
లవ్‌స్టోరీకి హ్యూమన్ ఎమోషన్స్‌ను జోడిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా కథ కొత్తగా ఉంది. కామెడీ, సెంటిమెంట్, ప్రేమకథ అన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు. అయితే, ఈ వీకెండ్లో ఫ్యామిలీతో టైమ్‌పాస్ చేసేందుకు కల్వన్ సినిమా చూడవచ్చు. కల్వన్ అంటే తెలుగులో దొంగ అని అర్థం. అయితే, ఆ టైటిల్‌కు సినిమాకు సంబంధం పెద్దగా లేదనిపిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

