బాలీవుడ్లో పాగా వేసిన ఫ్రెంచ్ భామ కల్కి కొచ్లిన్ మంచి నటి మాత్రమే కాదు కవయిత్రి కూడా! ఆమె ఎమోషన్స్‌ను అక్షరీకరించి అద్భుతాలు ఆవిష్కరిస్తున్నది. ‘నేను రచనలు చేస్తానని ఎన్నడూ అనుకోలేదు. ఒకానొక సమయంలో నా మనసులో రకరకాల భావోద్వేగాలు కలిగేవి! అవి ఎందుకు పుట్టేవో అంతుబట్టేవి కాదు! వాటిని ఎలా నియంత్రించాలో కూడా తెలిసేది కాదు.
ఓ రోజు ఆ భావాల్లో కొన్నిటిని కాగితం మీద పెట్టాను. నాకు తెలియకుండానే కొంత రిలాక్స్ అనిపించింది. కవితలు రాస్తున్నప్పుడు నా మనసు తేలికైన భావన కలిగింది. ఇప్పటికైతే వాటిని పబ్లిష్ చేయాలనే ఆలోచన లేదు. ఏదో ఒకరోజు తప్పకుండా అచ్చు వేయిస్తానేమో!’ అని చెబుతున్నది కల్కి.