‘కల్కి 2’ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు దర్శకుడు నాగ్అశ్విన్ ‘కల్కి 2’ షూటింగ్‌ని ఓ నెల క్రితం మొదలుపెట్టారు. కమల్‌హాసన్, అమితాబ్లపై కీలక సన్నివేశాలను, ఓ ఫైట్ సీక్వెన్స్ కూడా షూట్ చేసినట్టు తెలిసింది. రీసెంట్గా ఈ షూట్‌లోకి దుల్కర్ సల్మాన్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం అమితాబ్, దుల్కర్‌లకు సంబంధించిన సీన్స్ తీస్తున్నారట దర్శకుడు నాగ్అశ్విన్.
ఇదిలావుంటే.. నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఓ ప్రత్యేకమైన భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్లోనే ప్రభాస్ ఎంట్రీ సాంగ్‌ని షూట్ చేస్తారట. ఈ పాటలో ప్రభాస్‌తోపాటు దుల్కర్ సల్మాన్ కూడా ఉంటారని వినికిడి. కమల్‌హాసన్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ‘కల్కి 2898ఏడీ’ చిత్రం కర్ణుడి పాత్ర ఆగమనంతో ముగిసింది. ఈ సినిమా ఆద్యంతం కర్ణ పాత్రే ప్రధానంగా సాగుతుందట. అందుకే ఈ సినిమాకు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది.