Kalki 2898 AD | ప్రభాస్ ‘కల్కి’కి లీకుల బెడద..! కీలక చర్యలు చేపట్టిన వైజయంతి మూవీస్..!
Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ నటిస్తుండగా.. లోక నాయకుడు కమల్ హసన్, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలు పోషించనున్నారు.
Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ నటిస్తుండగా.. లోక నాయకుడు కమల్ హసన్, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలు పోషించనున్నారు. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీగానే అంచనాలున్నాయి. అయితే, ఇటీవల సినిమాలకు లీకులు ఇబ్బందికరంగా మారాయి. ప్రభాస్ చిత్రానికి సైతం లీకులు తప్పలేదు. ఇప్పటికే చిత్రానికి సంబంధించి సెట్స్‌ను నుంచి ఫొటోలు లీక్ అయ్యాయి.
ఇటీవల సినిమా నుంచి ప్రభాస్‌కు సంబంధించి ఫొటో లీకైంది. దీంతో నిర్మాతలు సీరియస్‌గా తీసుకున్నారు. అయితే, లీక్ వ్యవహారంలో చితానికి పని చేస్తున్న వీఎఫ్ఎక్స్ హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్ కాపీరైట్ నోటీస్‌ను విడుదల చేసింది. కల్కి2898AD మూవీకి పనిచేస్తున్న అన్ని భాగాలు కాపీరైట్ చట్టాల ద్వారా నడుస్తున్నాయని.. నిర్మాణ సంస్థ మాత్రమే అధికారికంగా విడుదల చేసేందుకు హక్కులున్నాయని, తమ ప్రమేయం లేకుండా ప్రజలకు తెలియజేయాలని లీక్ చేస్తే కనుక చట్టవిరుద్ధంగా చర్యలు తప్పవని హెచ్చరించింది.
కల్కి నుంచి ఏదైనా ఫొటోలు, వీడియోలు లీక్ చేస్తే చట్టపరంగా కఠిన శిక్ష తప్పదని పేర్కొంది. సైబర్ పోలీసుల సహకారంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియాలో విడుదల చేసిన నోటీసులో స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే కల్కి సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా.. అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘ఎప్పుడైతే అంధకారమనేది ఈ ప్రపంచాన్ని ఆక్రమిస్తుందో.. అప్పుడు ఓ శక్తి ఉద్భవిస్తుంది.. అంతమనేది ఇప్పుడు ఆరంభం అవుతుంది’ మొదలైన గ్లింప్స్‌లోనే సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని నాగ్ అశ్విన్ చెప్పకనే చెప్పాడు.
ప్రపంచాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడే కల్కి అవతారంలోనే ప్రభాస్ కనిపించబోతోన్నాడు. ఇక ఇది టైం ట్రావెల్ కథగా తెలుస్తున్నది. ఇందులో ఏకంగా 2898వ సంవత్సరానికి వెళ్లేట్టు కనిపిస్తుండగా.. ఇందులో ప్రభాస్ కల్కి అవతారంలో ప్రపంచాన్ని కాపాడే దేవుడిలా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, దిశాపటాని, పశుపతితో పాటు పలువురు తారలు కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

