Kajol In Spirit | ప్రభాస్ ‘స్పిరిట్’లో కాజోల్ దేవగణ్.?
SpiritMovie | పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'స్పిరిట్'. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
Sandeep Reddy Vanga | పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుటుండగా.. ఈ ప్రాజెక్ట్ గురించి ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం జోరుగా వినిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కాజోల్ దేవగణ్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది. ‘స్పిరిట్’ చిత్రంలో మొదట హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ నటి కరీనా కపూర్ పేరు వినిపించినప్పటికీ, ఆమె ఆ రూమర్లను ఖండించారు. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిప్తి దిమ్రీ ఎంపికయ్యారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’లో ఒక శక్తివంతమైన (Author-Backed) పాత్ర కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ నటి కాజోల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. కాజోల్‌కి కూడా స్క్రిప్ట్ బాగా నచ్చిందని ఆమె ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడానికి పాజిటివ్‌గా స్పందించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వార్త నిజమైతే, ‘స్పిరిట్’ కాజోల్కు మొదటి తెలుగు సినిమా కానుంది. ఆమె ఇంతకుముందు కొన్ని తమిళ చిత్రాలలో నటించినప్పటికీ, తెలుగులో ఇప్పటివరకు నటించలేదు. కాజోల్ లాంటి నటి ‘స్పిరిట్’ టీంలో చేరితే, ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌కు మరింత బలం, క్రేజ్ వస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్తపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

