కాజల్ గూఢచర్యం

వివాహనంతరం సినిమాల వేగం పెంచింది పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. కథాంశాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటూ పాత్రలపరంగా వైవిధ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో నాగార్జున జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది. ప్రవీణ్‌సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పవర్ఫుల్ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ ‘రా’ ఏజెంట్‌గా శక్తివంతమైన పాత్రను పోషిస్తోందట. దేశ రక్షణ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడే ధీశాలి అయిన మహిళగా ఆమె పాత్ర స్ఫూర్తివంతంగా సాగుతుందని చెబుతున్నారు. ఎంతటి భావోద్వేగాలనైనా తనలోనే అణచుకుంటూ దేశభక్తితో వృత్తినే దైవంగా భావించే గూఢచారి పాత్రలో ఆమె నటన సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. కాజల్ కెరీర్లోనే సవాలుతో కూడుకున్న పాత్ర ఇదని..దీనికోసం ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిసింది. ఇటీవలే ఈ చిత్రం గోవాలో ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో చిరంజీవి సరసన ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తోంది కాజల్ అగర్వాల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kajal
- kajal aggarwal
- raw agent
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

