ఇప్పటివరకూ ఒకెత్తు ‘సత్యభామ’ ఒకెత్తు
కథ నచ్చడంతో సినిమా ఒప్పుకోవడమేకాక, సరాసరి కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చి సెటిలైపోయి షూటింగ్లో పాల్గొంటున్నది కాజల్ అగర్వాల్. అదీ కాజల్ నిబద్ధత. ప్రస్తుతం ఆమె ‘సత్యభామ’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కుటుంబంతో సహా కాజల్ హైదరాబాద్‌లో సెటిలైంది ఈ సినిమా కోసమే.
కథ నచ్చడంతో సినిమా ఒప్పుకోవడమేకాక, సరాసరి కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చి సెటిలైపోయి షూటింగ్లో పాల్గొంటున్నది కాజల్ అగర్వాల్. అదీ కాజల్ నిబద్ధత. ప్రస్తుతం ఆమె ‘సత్యభామ’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కుటుంబంతో సహా కాజల్ హైదరాబాద్‌లో సెటిలైంది ఈ సినిమా కోసమే. ఇందులోని తన పాత్ర గురించీ, సినిమా గురించీ మీడియాతో మాట్లాడింది కాజల్. ‘ఇందులో నేను పోలీస్ అధికారిగా నటిస్తున్నాను. శశికిరణ్ డైరెక్ట్ చేసిన ‘మేజర్’ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నా ‘సత్యభామ’కు దర్శకుడు కాకపోయినా సమర్పకుడు కావడం, స్క్రీన్‌ప్లే అందించడం చాలా ఆనందంగా ఉంది. ‘భగవంత్ కేసరి’ షూటింగ్ టైమ్‌లో శశికిరణ్ నాకీ కథ చెప్పారు.
విని ఆశ్చర్యానికి లోనయ్యాను. అద్భుతమైన కథ, అత్యద్భుతమైన పాత్ర. వదులుకోకూడదని ఫిక్స్ అయిపోయి కుటుంబసమేతంగా హైదరాబాద్ వచ్చేశాను. అప్పట్నుంచి ఇక్కడే ఉంటూ, ఓవైపు బాబుని చూసుకుంటూ, మరోవైపు షూటింగ్లో పాల్గొంటున్నాను. ఇందులో నా పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాను. ఈ పాత్ర పోషణ విషయంలో విజయశాంతిగారే నాకు ఇన్స్పిరేషన్. ఆమెను స్పూర్తిగా తీసుకొని యాక్షన్ సీన్స్ చేస్తున్నా. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలన్నీ ఒకెత్తు. ‘సత్యభామ’ ఒక ఎత్తు. ఇప్పటికే 65శాతం షూటింగ్ పూర్తయింది.’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

