అజయ్ కతుర్వార్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అజయ్ గాడు’. భానుశ్రీ, శ్వేతా మెహతా కథానాయికలు. ఈ చిత్రంలోని ‘కైకు మామా’ అనే ర్యాప్‌సాంగ్ లిరికల్ వీడియోను ఇటీవల విడుదల చేశారు. శ్రీకాంత్, అజయ్, ఇన్సాన్ సాహిత్యం అందించిన ఈ పాటకు విశాల్ కొరియోగఫ్రీని అందించారు. సుమంత్ బట్టు సంగీతం సమకూర్చారు.
అజయ్ కతుర్వార్ మాట్లాడుతూ ‘ఇటీవల విడుదలైన టీజర్‌కు, ఫస్ట్లిరికల్ పాటకు చక్కని స్పందన వచ్చింది. ఈ చిత్రం నా కెరీర్‌కు మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.