The Red Bag | హీరోగా ఎంట్రీ ఇస్తున్న పవన్ కల్యాణ్ విలన్.. ఇంతకీ ‘ది రెడ్ బ్యాగ్’లో ఏముంది..?
the red bag | తెలుగు, తమిళం, హిందీ, కన్నడ ప్రాజెక్టులో విలన్‌గా నటించాడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కబీర్ దుహన్ సింగ్. ఇప్పటిదాకా సిల్వర్ స్క్రీన్‌పై విలన్‌గా నటించిన కబీర్ దుహన్ సింగ్ ఇక లీడ్ రోల్లో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు.
The Red Bag | గోపీంచంద్ నటించిన జిల్ సినిమాతో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు హర్యానా యాక్టర్ కబీర్ దుహన్ సింగ్. ఆ తర్వాత తెలుగులో బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ యాక్టర్ల సినిమాలతోపాటు పలు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ ప్రాజెక్టులో విలన్‌గా నటించాడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటిదాకా సిల్వర్ స్క్రీన్‌పై విలన్‌గా నటించిన కబీర్ దుహన్ సింగ్ ఇక లీడ్ రోల్లో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు.
ఈ టాలెంటెడ్ యాక్టర్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’(The Red Bag). ప్రసాద్ బెహరా మరో లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రంలో రాధ్య, స్నేహా సింగ్, ఆకాంక్ష ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. మేకర్స్ ఈ మూవీ లుక్‌ను విడుదల చేశారు. అయితే ఇందులో కబీర్ దుహన్ సింగ్ లుక్ చూపించకుండా.. కేవలం నలుగురు అమ్మాయిల లుక్స్ మాత్రమే చూపించారు. బ్యాగ్ చుట్టూ తిరిగే కథాంశంతో యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతుందంటున్నారు మేకర్స్. ఇంతకీ ఆ బ్యాగులో ఏముంది… కబీర్ దుహన్ సింగ్ పాత్ర ఎలా ఉండబోతుందనేది సస్నెన్స్లో పెట్టేశారు మేకర్స్.
ఈ మూవీకి రవికుమార్ సీరపు కథ, కథనం అందించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్నారు. ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
The Action Thriller #TheRedBag First Look Poster launched grandly by Hero @idineshtej & Writer-Director #HariPrasad 💥🎒#MemoryMakers Production No.1 Film 🎬#Raadya #RaviKavyas #HarikrishnaSomisetty @PROSaiSatish pic.twitter.com/ZDY0SOzUko
— BA Raju’s Team (@baraju_SuperHit) April 5, 2026
Read Also :
Trisha | త్రిష సైలెంట్ రియాక్షన్ వైరల్ ..రాజకీయ వివాదాల మధ్య లవ్ కోట్స్‌తో సందేశం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

