ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’. కబీర్‌సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక ప్రధాన పాత్రధారులు. రవికుమార్ సీరపు దర్శకుడు. హరికృష్ణ సోమిశెట్టి నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా థాయ్‌లాండ్‌లో కీలక సన్నివేశాలను, పాటను షూట్ చేశారు. థాయిలాండ్‌లో చిత్రీకరించిన సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. కబీర్‌సింగ్ ఇందులో డిఫరెంట్ పాత్రలో కనిపిస్తారు. అతి త్వరలో ఈ సినిమా టీజర్‌ని, త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నారు. స్నేహాసింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: విక్రమ్ రాజా, కెమెరా: ప్రియేష్ గురుసామి, సంగీతం: శేఖర్ మోపరి