Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Kaaka | మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ వినోదాత్మక చిత్రం 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణతో పాటు ఇతర నిర్మాణ పనులు కొనసాగుతుండగా, మరోవైపు విడుదలకు ముందే వ్యాపార లావాదేవీలపై చిత్రబృందం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
Kaaka | మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ వినోదాత్మక చిత్రం 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణతో పాటు ఇతర నిర్మాణ పనులు కొనసాగుతుండగా, మరోవైపు విడుదలకు ముందే వ్యాపార లావాదేవీలపై చిత్రబృందం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ‘కాకా’ సినిమాకు సంబంధించి న బిజినెస్ చర్చలు ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం నిర్మాతలు ఏకంగా రూ.70 కోట్లు కోట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాపై ఉన్న అంచనాలు, చిరంజీవి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ధరను నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా, ఈ మొత్తం కంటే తక్కువకు హక్కులను విక్రయించేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరనే ప్రచారం కూడా సాగుతోంది. మరి ఈ భారీ మొత్తాన్ని చెల్లించి తెలుగు రాష్ట్రాల హక్కులను దక్కించుకునేందుకు ఏ పంపిణీ సంస్థ ముందుకు వస్తుందో చూడాలి. ఈ చిత్రంలో చిరంజీవి కధిరి కాళిదాస్ అనే పాత్రలో కనిపించనున్నారు. మలయాళ నటి అనస్వర రాజన్ ఆయన కుమార్తె అమ్ములుగా నటిస్తోంది. నివేదా పేతురాజ్ మరో కీలక పాత్రలో కనిపించనుండగా, బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. కబీర్ దుహాన్ సింగ్ అండర్‌కవర్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు సునీల్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాతో కేవీఎన్ ప్రొడక్షన్స్ తొలిసారి తెలుగు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి, బాబీ కొల్లి కలయికలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. 2027 సంక్రాంతి బరిలో జనవరి 13న విడుదల కానున్న ‘కాకా’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆసక్తికరంగా మారింది. విడుదలకు ఇంకా సమయం ఉండగానే తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం రూ.70 కోట్ల డిమాండ్ తెరపైకి రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

