Jyothika | 47 ఏళ్ల వయసులోనూ అదిరే ఫిట్నెస్.. జ్యోతిక వర్కవుట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్!
Jyothika | ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని తన అందం, నటనతో ఏలిన స్టార్ హీరోయిన్ జ్యోతిక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, తన ఫిట్నెస్తో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం 47 ఏళ్ల వయసులోనూ ఆమె చూపిస్తున్న ఎనర్జీ, ఫిట్నెస్ స్థాయి చూసి అభిమానులు మాత్రమే కాదు.. సినీ ప్రముఖులు కూడా షాక్ అవుతున్నారు. మదర్స్ డే సందర్భంగా జ్యోతిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వర్కవుట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
Jyothika | ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని తన అందం, నటనతో ఏలిన స్టార్ హీరోయిన్ జ్యోతిక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, తన ఫిట్నెస్తో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం 47 ఏళ్ల వయసులోనూ ఆమె చూపిస్తున్న ఎనర్జీ, ఫిట్నెస్ స్థాయి చూసి అభిమానులు మాత్రమే కాదు.. సినీ ప్రముఖులు కూడా షాక్ అవుతున్నారు. మదర్స్ డే సందర్భంగా జ్యోతిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వర్కవుట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె చేసిన కఠినమైన వ్యాయామాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా పుల్-అప్స్, చిన్-అప్స్ వంటి కఠినమైన అప్పర్ బాడీ ఎక్సర్‌సైజ్‌లను ఎంతో ఈజీగా చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే.. తన ఆరోగ్యంపై కూడా అదే స్థాయిలో శ్రద్ధ పెట్టడం ఎంతో మందికి స్ఫూర్తిగా మారింది. “ఈ మదర్స్ డే సందర్భంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.. ఆరోగ్యంగా ఉండటమే నిజమైన సెల్ఫ్ లవ్” అంటూ ఆమె ఇచ్చిన సందేశం మహిళలను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సాధారణంగా మహిళలకు అప్పర్ బాడీ స్ట్రెంత్ పెంచుకోవడం కాస్త కష్టమైన విషయమే. కానీ జ్యోతిక మాత్రం ట్రైసెప్ డిప్స్, బెంచ్ హాప్స్, కోర్ వర్కవుట్స్ వంటి హెవీ ఫిట్నెస్ రొటీన్‌ను చాలా సులభంగా చేస్తూ కనిపించారు. ఆమె పట్టుదల, క్రమశిక్షణకు ఈ వీడియో నిదర్శనమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియో చూసిన పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, సోహా అలీ ఖాన్ వంటి సెలబ్రిటీలు కూడా జ్యోతిక ఫిట్‌నెస్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే “మీరు మాకు ఇన్స్పిరేషన్”, “ఏజ్ జస్ట్ ఏ నంబర్ అని మీరు ప్రూవ్ చేస్తున్నారు” అంటూ నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో.. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనే సందేశాన్ని జ్యోతిక తన జీవనశైలితోనే తెలియజేస్తున్నారు. కేవలం బరువు తగ్గడం కోసం మాత్రమే కాదు.. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో ఆమె ఉదాహరణగా నిలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jyothika
- suriya
- workout video
RELATED ARTICLES
తాజా వార్తలు
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

