విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్, అక్షర హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘జ్వాల’. ప్రకాష్ రాజ్, రైమా సేన్, నాజర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శర్వాంత్‌రామ్ క్రియేషన్స్, షిరిడీసాయి మూవీస్ పతాకాలపై జవ్వాజి రామాంజనేయులు, యం.రాజశేఖర రెడ్డి నిర్మించారు. నవీన్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల హీరో రానా విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ మాట్లాడుతూ…‘శక్తివంతమైన ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే పోరాటమే ఈ సినిమా ఇతివృత్తం. గ్లాడియేటర్స్ లాంటి వీరత్వం చూపించే వాళ్ల మధ్య పోరు ఆసక్తి కలిగిస్తుంది. రష్యా, కజికిస్తాన్, స్విట్జర్లాండ్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో చిత్రీకరణ జరిపాం. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’ అన్నారు.