Junior NTR | బింబిసార సీక్వెల్లో జూనియర్ ఎన్టీఆర్.. వార్తల్లో నిజమెంత?
Junior NTR in Bimbisara 2 | పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న బింబిసార సీక్వెల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా నటింపజేయాలని కళ్యాణ్‌రామ్ ప్లాన్ చేశాడంట. అందుకే ఎన్టీఆర్ రేంజ్‌కు తగ్గట్టుగా ఆయన క్యారెక్టరైజేషన్ ఉండేలా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారట.
Junior NTR in Bimbisara 2 | నందమూరి కళ్యాణ్‌రామ్ లేటెస్ట్ సెన్సేషన్ బింబిసార. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు జీ 5 ఓటీటీలో విడుదలై అక్కడ కూడా సత్తా చాటుతోంది. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడైనా వశిష్ఠ చక్కగా తెరకెక్కించాడు. అందుకే ఆడియన్స్ ఈ సినిమా చూసి ఫిదా అయిపోతున్నారు. దీని సీక్వెల్ ఎప్పుడొస్తుందా? అని టాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ చిత్ర దర్శకుడు అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. అందరూ ఊహించినట్టుగానే తొందరలోనే బింబిసార 2 వస్తుందని ప్రకటించాడు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడిన విశిష్ఠ.. బింబిసార సీక్వెల్‌ను కన్ఫార్మ్ చేశాడు. సోషియో ఫాంటసీగా వచ్చిన బింబిసార చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని.. ఊహించని విజయాన్ని అందించారని తెలిపాడు. ఇప్పుడు అందరూ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పిన ఆయన.. బింబిసార సీక్వెల్‌ను ఫస్ట్ పార్ట్ ను మించేలా తీసేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. కళ్యాణ్‌రామ్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యాక బింబిసార 2 మొదలవుతుందని చెప్పాడు. ప్రస్తుతం నవీన్ మేడారం దర్శకత్వంలో డేవిల్ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ కథలో బ్రిటిష్ గూఢచారిగా కళ్యాణ్‌రామ్ కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమా పూర్తికాగానే బింబిసార రెండో పార్ట్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సీక్వెల్‌కు సంబంధించి అదిరిపోయే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న బింబిసార సీక్వెల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా నటింపజేయాలని కళ్యాణ్‌రామ్ ప్లాన్ చేశాడంట. అందుకే ఎన్టీఆర్ రేంజ్‌కు తగ్గట్టుగా ఆయన క్యారెక్టరైజేషన్ ఉండేలా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారట. ప్రస్తుతం వినివిస్తున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్ ఇందులో ఒక వారియర్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. కానీ ఇదే కనుక నిజమైతే నందమూరి అభిమానులకు ఇంతకంటే ఖుషీ అయ్యే న్యూస్ ఇంకొక్కటి ఉండదనే చెప్పొచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

